మీ ఆధార్ కార్డు దుర్వినియోగం అయిందా ? ఎవరు వాడారో తెలుసా : సైబర్ మోసాలకు ఇలా చెక్ పెట్టండి!

మీ ఆధార్ కార్డు దుర్వినియోగం అయిందా ? ఎవరు వాడారో తెలుసా : సైబర్ మోసాలకు ఇలా చెక్  పెట్టండి!

ఆధార్ కార్డ్ పోవడం లేదా  ఆధార్ కార్డ్ డేటా దుర్వినియోగం చేయడం గురించి మీరు విని ఉండవచ్చు. అయితే సైబర్ నేరగాళ్లు మీ ఆధార్ కార్డు, దానికి సంబంధించిన డేటాను ఉపయోగించి మిమ్మల్ని ఈజీగా మోసం చేయవచ్చు. మీకు తెలియకుండా మీ ఆధార్ కార్డు దేనికైనా ఉపయోగించినట్లయితే, మీరు కంగారు పడకుండా  కొన్ని విషయాలు తెలుసుకోవడం చాలా సహాయపడుతుంది.
 
1. మీ ఆధార్ ఎక్కడ ఉపయోగించారో  తెలుసుకోండి
ముందుగా మీ ఆధార్ దుర్వినియోగం అయిందో లేదో తెలుసుకోవడానికి UIDAI అధికారిక వెబ్‌సైట్‌ ఓపెన్ చేసి  మీ ఆధార్ అథెంటికేషన్ హిస్టరీ (Authentication History) ని చెక్ చేయండి. ఇందులో తేదీ, సమయం, ఏ సంస్థ ద్వారా వెరిఫై(OTP/Biometric) జరిగిందో స్పష్టంగా ఉంటుంది. మీరు చేయని అనుమానాస్పద లావాదేవీలు లేదా నోటిఫికేషన్‌లు కనిపిస్తే, ఆ వివరాలను స్క్రీన్‌షాట్ తీసి ఆధారంగా భద్రపరచుకోండి.

2. వెంటనే ఆధార్, బయోమెట్రిక్స్ లాక్  
మీ వివరాలు ఇతరుల చేతికి చిక్కి దుర్వినియోగం కాకుండా ఉండటానికి UIDAI వెబ్‌సైట్ లేదా mAadhaar యాప్ ద్వారా వెంటనే లాక్ ఫీచర్ ఉపయోగించండి.
Biometrics Lock: మీ వేలిముద్రలు, ఐరిస్ డేటాను లాక్ చేస్తే మీ అనుమతి లేకుండా ఎవరూ ఏ రకమైన లావాదేవీలు చేయలేరు.
Aadhaar Lock: ఆధార్ నంబర్‌నే పూర్తిగా లాక్ చేసి, అవసరమైనప్పుడు వర్చువల్ ఐడీ (VID) ద్వారా మాత్రమే వినియోగించుకోవచ్చు.

3. ఆర్థిక మోసం జరిగితే: 1930 కి కాల్ చేయండి
ఆధార్ వివరాల ఆధారంగా మీ బ్యాంకు అకౌంట్, UPI లేదా ఇతర ట్రాన్సక్షన్స్ నుండి డబ్బులు పోయినట్లయితే  వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయండి  లేదా నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ (cybercrime.gov.in) లో ఆన్‌లైన్ ఫిర్యాదు చేయండి. మీ బ్యాంకుకు వెంటనే సమాచారం అందించి అకౌంట్/ ATM కార్డును బ్లాక్ చేయించండి. ట్రాన్సాక్షన్ ఐడీ, బ్యాంక్ మెసేజ్‌లు, స్టేట్‌మెంట్ ఆధారాలను సేఫ్ గా ఉంచుకోండి.

4.  పోలీస్ కంప్లైంట్
ఎవరైనా మీ ఆధార్‌ను ఉపయోగించి మీ పేరు మీద నకిలీ సిమ్ కార్డ్, లోన్ (Loan) లేదా బ్యాంక్ ఖాతా తెరిచినట్లు తెలిస్తే  వెంటనే మీ దగ్గరలోని  సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో లేదా సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి.  ఫిర్యాదుతో పాటు UIDAI హిస్టరీ కాపీ, ఇతర ఆధారాలను చూపించండి.

►ALSO READ | భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు: ఇన్వెస్టర్ల సంపద రూ.9 లక్షల కోట్లు ఆవిరి.. ఎందుకంటే?

5. ఆధార్ చట్టం ప్రకారం శిక్షలు
ఆధార్ చట్టం (Aadhaar Act) ప్రకారం వేరొకరి బయోమెట్రిక్స్, గుర్తింపు వివరాలను తప్పుగా ఉపయోగించడం లేదా మార్చడం తీవ్రమైన నేరం. ఈ చట్టం ప్రకారం నేరస్తులకు జైలు శిక్షతో పాటు భారీ జరిమానాలు విధించే నిబంధనలు ఉన్నాయి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు & సేకరించాల్సిన ఆధారాలు:
* ఏదైనా  ఫ్రాడ్ SMSలు, ఈమెయిల్‌లు, మెసేజ్‌లు లేదా కాల్ రికార్డింగ్‌లను తొలగించకుండా స్క్రీన్‌షాట్లు తీసి పెట్టుకోండి.
* ఆధార్ అప్‌డేట్ పేరుతో వచ్చే నకిలీ లింకులు పట్ల అప్రమత్తంగా ఉండండి, అనుమానాస్పద లింకులు క్లిక్ చేయవద్దు: