OTT New Movies: నెట్‌ఫ్లిక్స్‌లోకి మూడు కొత్త సినిమాలు.. తెలుగు ఆడియన్స్కు క్రేజీ ట్రీట్

OTT New Movies: నెట్‌ఫ్లిక్స్‌లోకి మూడు కొత్త సినిమాలు.. తెలుగు ఆడియన్స్కు క్రేజీ ట్రీట్

OTT Releases: థియేటర్లలో సందడి చేసిన సినిమాలు వరుసగా ఓటీటీ బాట పడుతున్నాయి. ముఖ్యంగా అక్టోబర్ మొదటి వారంలో నెట్‌ఫ్లిక్స్‌ ప్రేక్షకులకు పలు ఆసక్తికరమైన సినిమాలు అందుబాటులోకి రానున్నాయి. అందులో ‘రోమంచకం’, ‘మందాడి’, ‘ఎపిక్’సినిమాలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. లవ్, స్పోర్ట్స్ డ్రామా, పీరియాడిక్ యాక్షన్.. ఇలా మూడు డిఫెరెంట్ జానర్ల సినిమాలు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. 

‘రోమంచకం’- లవ్ స్టోరీలో ట్విస్ట్‌లు!

సుమంత్ ప్రభాస్, అనంతిక జంటగా నటించిన యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ డ్రామా ‘రోమంచకం’. వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని టాప్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించారు. ఈ సినిమా సెప్టెంబర్ 3న థియేటర్లలో విడుదలై మిక్స్డ్ డ్ టాక్ అందుకుంది. 

కథ:

కాలేజీ చదువు పూర్తి చేసిన అన్వేష్ (సుమంత్ ప్రభాస్) స్నేహితులతో కలిసి స్టార్టప్ ప్రారంభించాలనుకుంటాడు. ఇందులో భాగంగా ఓ డేటింగ్ యాప్‌ను రూపొందించే ప్రయత్నం చేస్తాడు. అదే సమయంలో మైథిలి (అనంతిక)తో పరిచయం ఏర్పడుతుంది. క్రమంగా ఆ పరిచయం ప్రేమగా మారుతుంది.

అయితే మైథిలిని కలవడానికి చెన్నై వెళ్లిన అన్వేష్‌కు అనుకోని షాక్ ఎదురవుతుంది. ఆమె ఒక్కసారిగా అతడిని బ్లాక్ చేయడంతో పాటు అదృశ్యమవుతుంది. అసలు మైథిలి ఎందుకు అలా చేసింది? ఆమెకు ఏం జరిగింది? ఆమె కనిపించకుండా పోవడం వెనుక కారణమేంటి? అనే ప్రశ్నల చుట్టూ కథ సాగుతుంది.

థియేటర్లలో భారీ స్థాయిలో ప్రభావం చూపలేకపోయిన ఈ సినిమా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ ద్వారా మరింత ఆడియన్స్‌ను చేరుకోనుంది. అక్టోబర్ 1 నుంచి తెలుగు సహా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

‘మందాడి’.. రూ.100 కోట్లకు పైగా వసూళ్లు!

తమిళ నటుడు సూరి, తెలుగు నటుడు సుహాస్ ప్రధాన పాత్రల్లో నటించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘మందాడి’. మతిమారన్ పుగళేంధి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహిమా నంబియార్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. జి.వి. ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. ఈ సినిమా సెప్టెంబర్ 10న థియేటర్లలో విడుదలై ఆకట్టుకుంది. 

కథేంటంటే:

రామనాథపురం తీర ప్రాంతం, మత్స్యకారుల జీవన విధానం, సంప్రదాయ పడవ పోటీ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఒకప్పుడు పడవ పందేల్లో రాణించిన ముత్తుకాళి (సూరి) కొన్ని కారణాల వల్ల ఆ ప్రపంచానికి దూరమవుతాడు. అయితే తీర ప్రాంతంలో ఆధిపత్యం కోసం సాగుతున్న గొడవలు, ఓ పడవ జట్టుకు ఎదురైన సమస్యల కారణంగా అతడు మళ్లీ పోటీ ప్రపంచంలోకి అడుగుపెట్టాల్సి వస్తుంది. అండర్‌డాగ్‌ జట్టుకు శిక్షణ ఇచ్చి వారిని గెలిపించే బాధ్యత అతడి మీద పడుతుంది.

►ALSO READ | Chiranjeevi : ఓటీటీలో చిరంజీవి పాడ్‌కాస్ట్‌... డిజిటల్ వేదికపై మెగాస్టార్‌ కొత్త చరిత్ర ఎప్పటినుంచంటే?

బాక్సాఫీస్ దగ్గర ‘మందాడి’కు మంచి స్పందన లభించింది. సెప్టెంబర్ 22 నాటికి ఈ సినిమా ఇండియా గ్రాస్ సుమారు రూ.90.18 కోట్లు సాధించిందని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. మరోవైపు సెప్టెంబర్ 23 నాటి రిపోర్టులు సినిమా రూ.100 కోట్ల మార్క్‌ను అందుకుని సక్సెస్ అయింది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ వేదికగా అక్టోబర్ 8 నుంచి స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. 

‘Epic - First Semester’

‘బేబీ’ ఫేమ్ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ‘Epic - First Semester’ సెప్టెంబర్ 11న థియేటర్లలో విడుదలై మిక్సెడ్ లాక్ అందుకుంది. ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ 9న Netflixలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే OTT విడుదల తేదీపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.

కథ:

వనపర్తికి చెందిన ఆదిత్య (ఆనంద్ దేవరకొండ) ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్తాడు. అక్కడ కడలి (వైష్ణవి చైతన్య) పరిచయం కావడంతో ఇద్దరి మధ్య ప్రేమ మొదలవుతుంది. ఆ తర్వాత వారి బంధం లివ్‌-ఇన్ రిలేషన్‌షిప్ వరకు వెళ్తుంది. అయితే విదేశీ జీవితం, కుటుంబ అంచనాలు, వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రేమలో ఎదురయ్యే సమస్యలు వారి జీవితాలను మలుపుతిప్పుతాయి. ఈ పరిస్థితుల్లో ఆదిత్య, కదలి తమ బంధాన్ని ఎలా కాపాడుకున్నారు? చివరకు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారన్నదే ‘Epic - First Semester’ కథ.