మెగాస్టార్ చిరంజీవి తన అభిమానులకు మరో సర్ ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. దశాబ్దాలుగా టాలీవుడ్ ను ఏలుతున్న ఆయన ఇప్పుడు డిజిటల్ వేదికపై సరికొత్త రికార్డులు సృష్టించేందుకు సిద్ధమయ్యారు. ప్రముఖ ఓటీటీ దిగ్గడం నెట్ ఫ్లిక్స్ కోసం ఒక పాడ్ కాస్ట్ షో చేయనున్నారనే టాక్ సినీ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఈ షో కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
వెండితెరపై తన తిరుగులేని మాస్ ఎనర్జీతో అలరించిన మెగాస్టార్.. ఈ సారి అత్యంత పర్సనల్ , క్యాజువల్ అవతార్ లో కన్పించబోతున్నారు. నిజానికి నెట్‌ఫ్లిక్స్ సంస్థ మొదట చిరంజీవిపై ఒక పూర్తిస్థాయి డాక్యుమెంటరీ రూపొందించాలని భావించింది. అయితే, చిరంజీవి మాత్రం ప్రస్తుత అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగా 'పాడ్‌కాస్ట్' శైలినే ఎంచుకున్నట్లు సమాచారం.. ఈ ఫార్మాట్ ద్వారా తన సుదీర్ఘ సినీ ప్రయాణం, వ్యక్తిగత అనుభవాలు, విజయాలు, ఎదుర్కొన్న సవాళ్ల గురించి ఎలాంటి దాపరికం లేకుండా.. అత్యంత స్వేచ్ఛగా అభిమానులతో పంచుకోవచ్చని ఆయన భావించినట్లు తెలుస్తోంది.
ఈ బిగ్ ప్రాజెక్ట్‌కి చిరు పెద్ద కుమార్తె సుష్మిత కొణిదెల బాధ్యతలు చేపట్టబోతోంది. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సుష్మిత ఇప్పటికే నిర్మాతగా నిరూపించుకుంది. ఈ అనుభవంతోనే ఇప్పుడు తన తండ్రి చిరంజీవితో ఈ పాడ్‌కాస్ట్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. తండ్రీకూతుళ్ల ఈ కాంబినేషన్ షోపై అంచనాలను రెట్టింపు చేస్తోంది.
ALSO READ : నాగ్, ఎన్టీఆర్‌తో యాడ్స్.. హీరోగా ఎంట్రీతోనే కౌశిక్ చేతిలో 5 క్రేజీ ప్రాజెక్ట్స్!
సాధారణంగా ఏ ఇంటర్వ్యూలోనూ బయటకు రాని ఎన్నో అరుదైన సీక్రెట్స్, ఇండస్ట్రీ సీనియర్లతో చిరు జ్ఞాపకాలు, ఆయన కెరీర్‌ను మలుపు తిప్పిన అరుదైన సంఘటనలు ఈ షో ద్వారా వెలుగులోకి రానున్నాయి. త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ నుంచి ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక సీనియర్ టాప్ స్టార్ గ్లోబల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై పాడ్‌కాస్ట్‌తో రావడం ఇదే తొలిసారి . ఈ షో కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..
