హైదరాబాద్: తెలంగాణ యువ షూటర్ ఈషా సింగ్ పోరాట స్ఫూర్తి క్రీడాలోకానికి ఆదర్శమని సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసించారు. జపాన్‌లో జరుగుతోన్న 2026 ఆసియా క్రీడల్లో భారత షూటర్ ఈషా సింగ్ రజత పతకం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈశా సింగ్కు సీఎం రేవంత్ అభినందనలు తెలియజేశారు.
ఆసియా క్రీడల్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో భారత స్టార్ షూటర్, తెలంగాణ ముద్దుబిడ్డ హైదరాబాద్ నగరానికి చెందిన ఈషా సింగ్ వెండి పతకం సాధించడంపై ఆయన హార్షం వ్యక్తం చేశారు. ఐదుసార్లు షూటాఫ్‌లలో ఒత్తిడిని ధైర్యంగా ఎదుర్కొని, స్వల్ప తేడాతో బంగారు పతకాన్ని కోల్పోయినా ఆమె ప్రదర్శన అద్భుతమని ప్రశంసించారు. భవిష్యత్తులో అంతర్జాతీయ వేదికలపై ఈషా మరెన్నో గొప్ప విజయాలు అందుకొని దేశ ప్రతిష్ఠను, తెలంగాణ కీర్తిని చాటాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.
షూట్-ఆఫ్‌లో తృటిలో స్వర్ణం కోల్పోయిన ఈషా
షూటింగ్ వ్యక్తిగత విభాగంలో భారత షూటర్ ఇషా సింగ్ (Esha Singh) అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. 25 మీటర్ల వ్యక్తిగత విభాగంలో చైనాకు చెందిన జియో జియారుక్సాన్తో గోల్డ్ మెడల్ కోసం ఇషా గట్టి పోటీ ఇచ్చింది. వీరి మధ్య చివరి వరకు హోరాహోరీగా జరిగిన పోరు.. ఇద్దరి స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ షూట్-ఆఫ్కు వెళ్ళింది. ఆ షూట్-ఆఫ్ చైనా షూటర్ విజయం సాధించి బంగారు పతకాన్ని దక్కించుకోగా, ఇషా సింగ్కు రజతంతో సరిపెట్టుకుంది.
►ALSO READ | షూటింగ్‌లో ఇషా సింగ్‌కు రజతం, కురాష్లో కాంస్యం.. పతకాల జోరులో భారత్!
