షూటింగ్‌లో ఇషా సింగ్‌కు రజతం, కురాష్లో కాంస్యం.. పతకాల జోరులో భారత్!

షూటింగ్‌లో ఇషా సింగ్‌కు రజతం, కురాష్లో కాంస్యం.. పతకాల జోరులో భారత్!

Asian Games 2026: ఆసియా క్రీడల్లో తొమ్మిదో రోజు భారత్ తన పతకాల వేటను ప్రారంభించింది. షూటింగ్ విభాగంలో రజత పతకం, కురాష్ క్రీడలో కాంస్య పతకం టీమిండియా సొంతమయ్యాయి. అలాగే స్టార్ బాక్సర్ లవ్లీనా తన పతకాన్ని ఖాయం చేసుకుంది. ప్రస్తుతం భారత్ 39 పతకాలతో 12వ స్థానంలో కొనసాగుతోంది. ఇందులో 4 స్వర్ణాలు, 17 రజతాలు, 18 కాంస్య పతకాలు ఉన్నాయి.   

షూట్-ఆఫ్‌లో తృటిలో కోల్పోయిన స్వర్ణం: 

షూటింగ్ వ్యక్తిగత విభాగంలో భారత షూటర్ ఇషా సింగ్ (Esha Singh) అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. 25 మీటర్ల వ్యక్తిగత విభాగంలో చైనాకు చెందిన జియో జియారుక్సాన్‌తో గోల్డ్ మెడల్ కోసం ఇషా గట్టి పోటీ ఇచ్చింది. వీరి మధ్య చివరి వరకు హోరాహోరీగా జరిగిన పోరు.. ఇద్దరి స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ షూట్-ఆఫ్‌కు వెళ్ళింది. ఆ షూట్-ఆఫ్‌లో చైనా షూటర్ విజయం సాధించి బంగారు పతకాన్ని దక్కించుకోగా, ఇషా సింగ్‌కు రజతంతో సరిపెట్టుకుంది.

కురాష్ లో మరోసారి కాంస్యం: 

కురాష్ క్రీడలో భారత అథ్లెట్ పింకీ బల్హారా కాంస్య పతకం సాధించింది. సెమీఫైనల్స్‌లో కొరియా క్రీడాకారిణి మో సుమిన్ చేతిలో 5–0 తేడాతో ఆమె ఓటమిపాలయ్యారు. 2018 ఆసియా క్రీడలలోనూ కాంస్యం సాధించిన పింకీ బల్హారా, ఈసారి కూడా అదే మెరుగైన ప్రదర్శనతో మరో కాంస్య పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. 

►ALSO READ | రోహిత్ శర్మ ఔటవ్వగానే ఫ్యాన్స్ సంబరాలు: ద్రవిడ్, జడేజాలకు కూడా ఇదే అనుభవం!

పతకం ఖాయం చేసుకున్న స్టార్ బాక్సర్ లవ్లీనా: 

భారత టోర్నమెంట్‌లో స్టార్ బాక్సర్ లవ్లీనా అద్భుత ప్రతిభతో పతకాన్ని ఖారరు చేసుకుంది. మహిళల 75 కిలోల విభాగంలో బరిలోకి దిగిన లవ్లీనా, దక్షిణ కొరియా బాక్సర్‌పై 5–0 తేడాతో ఘన విజయం సాధించి నేరుగా సెమీఫైనల్స్‌లోకి అడుగు పెట్టింది. దీని ద్వారా లవ్లీనా పతకాన్ని ఖరారు చేసుకున్నట్లు అయింది.