తెలుగు సినిమా క్రేజ్ ఇప్పుడు కేవలం థియేటర్లకే పరిమితం కాలేదు. ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో మార్మోగుతోంది. అమెరికా - ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. శత్రుదేశాలకు గట్టి హెచ్చరికలను పంపించేస్తోంది ఇరాన్ రాయబార కార్యాలయాలు. మీ ఎత్తులు మా దగ్గర కాదు.. డోంట్ కేర్ బ్రో అంటూ అమెరికాకు వార్నింగ్ ఇస్తూ.. మన టాలీవుడ్ యాక్షన్ సీన్లకు తెగా వాడేస్తోంది ఇరాన్. ఇలా వరుస పెట్టి తెలుగు చిత్రాల్లో సీన్లను వాడుకోవడం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
లేటెస్ట్ గా హైదరాబాద్‌లోని ఇరాన్ కాన్సులేట్ తమ అధికారిక 'X' ఖాతాలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి: ది బిగినింగ్' లోని ఐకానిక్ వార్ సీన్‌ను షేర్ చేసింది. కాలకేయుల దండయాత్ర సమయంలో అమరేంద్ర బాహుబలి (ప్రభాస్) జంతు బలికి బదులుగా తన రక్తాన్నే మాతృభూమికి త్యాగం చేస్తూ, సైన్యంలో పూనకాలు తెప్పించే సన్నివేశాన్ని పోస్ట్ చేసింది.
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ చేసిన "మేము ఎవరికీ తలవంచం.. మోకరిల్లం" అనే వ్యాఖ్యలకు ఈ వీడియోను జోడిస్తూ.. "కాలకేయులకు ఎదురొడ్డి నిలిచిన బాహుబలిలాగే, మా మాతృదేశం కోసం మేం కూడా రక్తం చిందించి ప్రాణత్యాగానికి సిద్ధం"అని రాసుకొచ్చింది.
Dr. Pezeshkian, President of I.R #Iran at UNGA: "Will never bow our head or bend the knee"
— Iran In Hyderabad (@IraninHyderabad) September 27, 2026
Like Baahubali standing against the Kalakeyas, we also shed our own blood in sacrifice for the homeland. pic.twitter.com/xc1S9H346Q
ఇక్కడితో ఆగకుండా, పర్షియన్ గల్ఫ్‌లో అమెరికాకు చెందిన 'Remus 600' డ్రోన్‌ను సీజ్ చేశామని చెబుతూ.. నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన 'భగవంత్ కేసరి' మూవీలోని మాస్ యాక్షన్ సీన్‌ను కూడా ఇరాన్ మిషన్ షేర్ చేసింది. అంతకుముందు జింబాబ్వేలోని ఇరాన్ ఎంబసీ బాలయ్య సీన్‌ను పోస్ట్ చేస్తూ, దానిని 'బాలీవుడ్ మూవీ'గా పేర్కొనడంతో భారతీయ నెటిజన్లు సరదాగా ట్రోల్ చేస్తూ "ఇది పక్కా మాస్ తెలుగు సినిమా" అని క్లారిటీ ఇచ్చారు.
US Remus 600 unmanned underwater vehicle captured by Iran’s IRGC Navy in the Strait of Hormuz.
— Iran In Hyderabad (@IraninHyderabad) September 27, 2026
Trump, Hegseth and CENTCOM Reactions.😎 pic.twitter.com/ZBZyaWobHA
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, సెంటకామ్ (CENTCOM) హెచ్చరికలకు కౌంటర్‌గా ఇరాన్ ఇలా ఓటిటి, సోషల్ మీడియా రీల్స్ స్టైల్‌లో టాలీవుడ్ మాస్ సీన్లతో వార్నింగ్‌లు ఇవ్వడం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. గ్లోబల్ డిప్లమసీలో మన 'జై మాహిష్మతి' సౌండ్ ఇలా మార్మోగిపోవడం గర్వకారణంగా ఉందంటూ తెలుగు సినీ ప్రియులు సంబరపడుతున్నారు. సాధారణంగా దౌత్య సంబంధాలు, హెచ్చరికలు అత్యంత సీరియస్‌గా ఉండే వేదికలపై.. మన టాలీవుడ్ స్టార్స్ మాస్ ఎనర్జీని ఇరాన్ ఒక ప్రతీకగా (Symbolic Mind Game) ఎంచుకోవడం చూస్తుంటే తెలుగు సినిమా గ్లోబల్ రేంజ్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందంటున్నారు నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు..
►ALSO READ | 'అనకాపల్లి' సౌండ్ గట్టిగా వినిపించబోతోంది.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డైరెక్టర్ వి. వి. వినాయక్!
