శ్రావణ మాసం అంటేనే... ఉపవాసాలు, పూజలు, వ్రతాలు. మరీ ముఖ్యంగా అమ్మవారికి ప్రసాదాలు పెట్టడం ఆనవాయితీ. చాలా మంది వర్కింగ్ ఉమెన్స్ప్రసాదాలను తయారు చేసేందుకు సమయం లేక చాలా ఇబ్బంది పడుతుంటారు. ఓ పక్క ఆఫీసుల్లో సెలవు దొరక్క.. మరోపక్క ఆచారాలతో పడే ఇబ్బంది అంతా ఇంతా కాదు.. అలాంటి వారు జస్ట్ పదే పది నిమిషాల్లో ఎంతో రుచికరమైన శెనగపప్పు పాయసం.. బెల్లం అన్నం ప్రసాదాలను త వెరైటీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ ప్రసాదాలను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం..
శెనగపప్పు పాయసం ప్రసాదం తయారీకి కావలసినవి
- శెనగపప్పు: ముప్పావు కప్పు
- పాలు : ముప్పావు కప్పు
- బెల్లం తురుము: ఒక కప్పు
- ఎండు కొబ్బరి ముక్కలు : ఒక టేబుల్ స్పూన్ ( కావాలంటే)
- జీడిపప్పు, కిస్మిన్: ఒక్కోటి అర టేబుల్ స్పూన్ చొప్పున
- నెయ్యి: రెండు టేబుల్ స్పూన్లు
శెనగపప్పు పాయసం తయారీ విధానం
- స్టవ్ పై పాన్ పెట్టి శెనగపప్పుని వేగించాలి.
- వేగించిన పప్పులో ఒకటిన్నర కప్పు నీళ్లు పోసి ప్రెజర్ కుక్కర్లో నాలుగు విజిళ్లు వచ్చే వరకు ఉడికించాలి.
- పప్పుగుత్తితో మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా రుబ్బాలి.
- స్టవ్ పై ఒక గిన్నె పెట్టి బెల్లం తురుము, పావు కప్పు నీళ్లు పోసి బెల్లం కరిగే వరకు వేడి చేయాలి.
- అందులో రుబ్బిన శెనగపప్పు, ఇలాచీ పొడి వేసి ఐదు నిమిషాలు మగ్గించాలి.
- నెయ్యిలో వేగించిన కిస్మిస్, జీడిపప్పు, ఎండుకొబ్బరి ముక్కలు వేసి స్టవ్ ఆపేయాలి.
- అంతే శెనగపప్పు పాయసం రడీ.. అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆ తరువాత మనం తినాలి. ఇది ఎంతో టేస్టుగా ఉంటుంది.
బెల్లం అన్నం తయారీకి కావలసిన పదార్ధాలు
- బియ్యం - ఒక కప్పు
- పెసరపప్పు - అరకప్పు
- నెయ్యి - మూడు స్పూనులు
- బెల్లం - అరకప్పు
- పాలు - ఒక కప్పు
- జీడిపప్పులు - ఆరు
- కిస్ మిస్ - పది
- యాలకుల పొడి - అరస్పూన్
బెల్లం అన్నం తయారీ విధానం
- బియ్యాన్ని, పెసరపప్పును అరగంట నానబెట్టాలి.
- స్టవ్ వెలిగించి ఈ రెండింటిని కుక్కర్ లో మెత్తగా ఉడకబెట్టాలి. తరువాత కుక్కర్ మూత తీసి పెద్ద గరిటతో బాగా కలపాలి.
- సన్నటి మంటపై బియ్యం .. పెసరపపప్పు మిశ్రమం ఉంచి అందులో తురిమిన బెల్లం యాలకుల పొడి వేసి బాగా కలపాలి.
- ఆ మిశ్రమంలో బెల్లం కరిగిన తరువాత కాచిన పాలను పోసి.. దగ్గరగా అయ్యేదాకా ఉడికించాలి.
- నెయ్యిలో కిస్ మిస్.. జీడిపప్పు వేయించి కలుపుకోవాలి.
- స్టవ్ పై నుంచి దించే ముందు రెండు స్పూనుల నెయ్యి వేసుకోవాలి. అంతే బెల్లం–అన్నం ప్రసాదం రడీ.
- అమ్మవారికి ఈ ప్రసాదం చాలా ఇష్టం. ఈ ప్రసాదాన్ని అమ్మవారికి సమర్పించి.. మనం తిన్న తరువాత.. చుట్టు పక్కల వారికి పంచిపెడితే సంపద వృద్ది జరుగుతుందని పండితులు చెబుతున్నారు.
