స్పేస్లోకి సక్సెస్ ఫుల్గా స్టార్‌షిప్ రాకెట్.. కానీ మూడు గంటల్లోనే భూమి మీదకు.. పసిఫిక్లో బ్లాస్ట్..!

స్పేస్లోకి సక్సెస్ ఫుల్గా స్టార్‌షిప్ రాకెట్.. కానీ మూడు గంటల్లోనే భూమి మీదకు.. పసిఫిక్లో బ్లాస్ట్..!

స్పేస్‌ఎక్స్కు చెందిన స్టార్‌షిప్ రాకెట్.. సోమవారం తన తొలి కక్ష్య పూర్తి అవక ముందే భూమి మీదకు తిరిగి వచ్చింది. పసిఫిక్ మహాసముద్రంలో దిగిన వెంటనే ఒక పేలుడు సంభవించడం లైవ్‌స్ట్రీమ్‌లో కనిపించింది. సుమారు 10 గంటల పాటు సాగే ప్రయోగం కోసం.. స్టార్‌షిప్ ఉదయం 9 గంటలకు (ET) కొద్దిసేపటి ముందు దక్షిణ టెక్సాస్ నుంచి ప్రయోగించారు.

చిలీకి పశ్చిమాన పసిఫిక్ మహాసముద్రంలో దిగడానికి ముందు, అది భూమి చుట్టూ సుమారు ఆరు సార్లు పరిభ్రమించాల్సి ఉంది. కానీ.. స్పేస్‌ఎక్స్ కేవలం 3 గంటల తర్వాత దానిని తిరిగి భూమికి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మిషన్‌లో భాగంగా, స్టార్‌షిప్ తమ కొత్త, మెరుగైన పనితీరు గల 26 స్టార్‌లింక్ V3 ఇంటర్నెట్ ఉపగ్రహాలను ప్రయోగించింది.

అయితే.. ఈ పేలుడుకు కారణం తెలియరాలేదు. ఆ సంస్థ ఎటువంటి వివరాలు వెల్లడించలేదు. స్టార్‌షిప్ మొదటి దశ సూపర్ హెవీ బూస్టర్ ప్రయోగించిన కొద్దిసేపటికే గల్ఫ్ ఆఫ్ అమెరికాలో పడిపోయింది. ప్రయోగించిన కొద్దిసేపటికే దాని ఇంజన్లలో ఒకటి ఆగిపోవడంతో అంతరిక్ష నౌక కక్ష్యలోకి చేరుకోలేకపోయింది. గత మూడేళ్లలో టెక్సాస్ దక్షిణ కొన నుంచి స్టార్‌షిప్ చేసిన 14వ పూర్తి స్థాయి ప్రయోగం ఇది. అంతకుముందు జరిగిన పరీక్షా ప్రయోగాలు, ప్రపంచానికి సగం దూరంలో ఉన్న హిందూ మహాసముద్రాన్ని దాటి ముందుకు వెళ్లలేదు.

►ALSO READ | దేశంలో జనాభా పెరుగుతుంటే.. ఓటర్లు ఎట్లా తగ్గుతరు: సర్‎పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

ఈసారి, స్పేస్‌ఎక్స్ 275 కిలోమీటర్ల ఎత్తు నుంచి భూమి చుట్టూ ఒక్కసారి కాదు, దాదాపు 10 గంటల వ్యవధిలో ఆరుసార్లు ప్రదక్షిణ చేసి, చిలీ సమీపంలోని పసిఫిక్ మహాసముద్రంలో దిగాలని సంకల్పించింది. స్టార్‌షిప్ గంటకు 28,000 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతూ సరైన కక్ష్యను చేరుకున్నప్పటికీ, ఫ్లైట్ కంట్రోలర్లు ముందు జాగ్రత్తగా వ్యవహరించి, కేవలం రెండు ప్రదక్షిణల తర్వాత దాన్ని కొన్ని గంటల ముందే వెనక్కి తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. అయితే.. ఉదయం ప్రయోగించిన కొద్ది నిమిషాలకే అది గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో పడిపోయింది.