ఫుడ్ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘించినందుకు తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు హైదరాబాద్ సిటీలోని 2 డొమినోస్, 7 KFC అవుట్‌లెట్ల FSSAI లైసెన్సులను సస్పెండ్ చేశారు. శరత్ సిటీ మాల్, ఇనార్బిట్ మాల్‌లోని డొమినోస్ ఔట్లెట్స్తో పాటు మరో 7 KFC అవుట్‌లెట్లలో తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వంటగదుల్లో బొద్దింకలు, ఎలుకల ఆనవాళ్లు, గడువు ముగిసిన ఆహార పదార్థాలు, అపరిశుభ్ర పరిస్థితులను గుర్తించారు. మొత్తం 26 అవుట్‌లెట్లలో తనిఖీలు చేసి, 20 ఆహార నమూనాలను సేకరించారు. నిబంధనలు పాటించని 9 శాఖలు కార్యకలాపాలు నిలిపివేయాలని అధికారులు ఆదేశించారు.
మొత్తం 26 KFC, డొమినోస్ అవుట్‌లెట్లలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. 20 ఆహార నమూనాలను సేకరించడంతో పాటు, సుమారు 52 కిలోల సింథటిక్ మెగ్నీషియం సిలికేట్ రసాయనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన 9 అవుట్‌లెట్ల లైసెన్సులను సస్పెండ్ చేసి, వాటి కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశించారు. ప్రముఖ ఫుడ్ బ్రాండ్ల అవుట్‌లెట్లలోనే ఇలాంటి అపరిశుభ్ర పరిస్థితులు బయటపడటం నగరవాసుల్లో ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా మాల్స్‌కు వెళ్లే ఫ్యామిలీస్, యూత్ ఫాస్ట్‌ఫుడ్ తీసుకునే ముందు ఆహార నాణ్యత, పరిశుభ్రతపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని ఈ ఘటన గుర్తుచేసింది.
ఈ ఔట్ లెట్స్పై చర్యలు:
* డొమినోస్:
శరత్ సిటీ మాల్, కొండాపూర్
ఇనార్బిట్ మాల్, మాదాపూర్
* KFC:
మదీనాగూడ
సింధీ కాలనీ
చార్మినార్
మూసారాంబాగ్
బంజారాహిల్స్
శిల్పకళా వేదిక
ఇనార్బిట్ మాల్
