హిందూ పురాణాల సంస్కృతీ సాంప్రదాయాల్లో శ్రావణ మాసానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అందుకే ఈ మాసాన్ని పూజల మాసం లేదా శుభాల మాసం, లేదా పండగల మాసం అని పిలుస్తుంటారు. శ్రీ మహా విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణా నక్షత్రం పేరుతో శ్రావణమాసం వచ్చిందని పురాణాల ద్వారా తెలుస్తుంది. అందుకే ఈ మాసం శ్రీమన్నారాయణుని ఆరాధనకు కూడా శ్రేష్టమైనది. భవిష్య పురాణం ప్రకారం శ్రావణ శనివారాలలో కొన్ని పరిహారాలు చేస్తే శని బాధల నుంచి ఉపశమనం కలుగి.. అనుకున్న పనులు జరుగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
శ్రావణమాసంలో వచ్చే శనివారాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని పురాణాల ద్వారా తెలుస్తుంది. జ్యోతిష్యశాస్త్రప్రకారం శని దోషంతో ఇబ్బంది పడేవారు చాలా కష్టాలు పడుతుంటారు. ఏలినాటి శని, అర్దాష్టమ శని, శని మహర్దశలో ఉన్నవారు.. ఇంకా.. శని భగవానుడి ఆధిపత్యం వహించే మకర, కుంభ రాశులు శ్రావణమాసం శని వారాల్లో కొన్ని పరిహారాలు చేస్తే శని బాధలు పటా పంచలవుతాయని పండితులు చెబుతున్నారు.
పురాణాల ప్రకారం శనివారం శని భగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు. అలాగే వెంకటేశ్వరస్వామికి అత్యంత ప్రీతికరమైన రోజు.. శ్రావణమాసానికి మహా విష్ణువు నక్షత్రానికి చాలా దగ్గర సంబంధమందని పండితులు చెబుతున్నారు. సాధారణంగా శ్రావణ మాసంలో చేసే పూజలకు.. వ్రతాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇక జాతకంలో గోచార రీత్యా శనిభగవానుడి అశుభ దృష్టివలన కలిగే ఇబ్బందులు తొలగిపోవాలంటే శ్రావణమాసం శనివారాల్లో ఈ నియమాలు పాటించాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
శ్రావణమాసం శనివారం పాటించాల్సిన నియమాలు
- పేదలకు అన్నదానం
- దేవాలయంలో బ్రాహ్మణునికి స్వయంపాకం, దక్షిణ తాంబూలం
- గోమాతను పసుపు, కుంకుమలతో పూజించి.. తోటకూర, గోధుమలు ఆహారంగా ఇవ్వాలి.
- అనాధలకు, బిచ్చగాళ్లకు వస్త్రదానం
- నవగ్రహాలున్న ఆలయంలో నవగ్రహ పూజ.. శని భగవానుడికి తైలాభిషేకం.. నల్లనువ్వులు దానం
- హనుమంతుని ఆలయంలో స్వామివారికి ఆకుపూజ, వడమాల సమర్పణ, హనుమాన్ చాలీసా పారాయణం
- బెల్లం, నువ్వులతో తయారు చేసిన పదార్ధాలను పేదలకు పంచడం
- వీలుని బట్టి పవిత్ర నదుల్లో స్నానం.. లేదంటే.. స్నానం చేసేటప్పుడు బకెట్లో నీటిని నింపుకొని దానిలో కొద్దిగా నల్లనవ్వులు వేసి ఆ నీటితో స్నానం చేయాలి.
- ప్రదోష కాలంలో ( సాయంత్రం 5.30 నుంచి 6.45 మధ్యలో) రావి చెట్టు మొదట్లో మట్టి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన
- ఇంట్లో దేవుడి మందిరం దగ్గర ఉదయం ( 5 గంటల నుంచి 6 గంటలలోపు) పిండితో ప్రమిదను తయారు చేసి.. ఆవునెయ్యితో దీపారాధన
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
►ALSO READ | విష్ణుమూర్తి నక్షత్ర నెల.. లక్ష్మీదేవి కటాక్షం .. అమ్మవారి పూజ..
