కడుపులో బిడ్డతో మాట్లాడండి..వింటాడు..గుర్తుపెట్టుకుంటాడు..అభిమన్యుడి కథ..పురాణాలకు సైన్సు జవాబు ఇదే..!

కడుపులో బిడ్డతో మాట్లాడండి..వింటాడు..గుర్తుపెట్టుకుంటాడు..అభిమన్యుడి కథ..పురాణాలకు సైన్సు జవాబు ఇదే..!

శిశువులు గర్భంలో ఉండగానే  వినికిడి శక్తిని కలిగి ఉంటారా.. ఇంట్లో మాట్లాడుకొనే మాటలు వారి చెవుల్లో రింగ్​ రింగ్​ అంటాయా..పురాణాల్లో చెప్పిన విధంగా అభిమన్యుడు.. తల్లి గర్భంలో పద్మవ్యూహం గురించి తెలుసుకున్నాడా.. గర్భస్థ శిశువులు మాటలు వింటారనే విషయానికి శాస్త్రీయ నిదర్శనాలు ఏమైనా ఉన్నాయా.. పరిశోధనలు ఏమైనా జరిగాయా.. మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..  !

మహాభారతంలోని అభిమన్యుని కథ అందరికీ తెలిసినదే. అర్జునుడు తన భార్య సుభద్రకు పద్మవ్యూహం గురించి చెబుతుండగా  ఆమె గర్భములోని అభిమన్యుడు విని యుద్ద తంత్రములను  నేర్చుకున్నాడని మహాభారత కథలో ఉందని పండితులు చెబుతున్నారు.

 హిరణ్యకశిపుని భార్య లీలావతిని, అతడు ఇంటలేని సమయములో ఇంద్రుడు చెరబట్టడాని ఆ సమయంలో  నారదుడు దేవతలకు నచ్చచెప్పి ఆమెను తన ఆశ్రమమునకు తీసుకెళ్లాడు.  అచట ఆమెకు నారదుడు నారాయణతత్త్వమును గురించి ఉపదేశించాడు. అప్పుడు ఆమె గర్భములోని ప్రహ్లాదుడు ఆ తత్త్వమును విని  గొప్ప విష్ణుభక్తుడైనాడనే విషయం కూడా అందరికి తెలిసిన విషయమే..

అయితే ఇలాంటి కథలకు శాస్త్రీయపరంగా అంటే గర్భంలో ఉండగానే శిశువు నిజంగా వినగలదా   అనే విషయాలను పరిశీలిస్తే .. 1984 జులై 30 వ  తేదీన ఒక ఆంగ్ల పత్రికలో లెర్నింగ్ బిగిన్స్ ఇన్ వూంబ్ (Learning begins in Womb) అనే వార్త ప్రచురణ జరిగింది.  దీని ప్రకారం యూ.ఎస్​.ఏ. లో గర్భస్థ శిశువుల వినికిడి గురించి శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. 

ఆ పరిశోధనల ప్రకారం.. శిశువు జన్మించుటకు ముందు వినే సామర్ధ్యము గ్రహించి.. భూమిపై జన్మించిన తరువాత ఆ మాటల ప్రకారం.. జీవనం కొనసాగించే అవకాశం ఉందని శాస్త్రవేత్తల అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. 

అయితే ఇప్పుడు ఈ విషయాన్ని  విజ్ఞాన శాస్త్రవేత్తలు,జీవశాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాని భారతదేశంలో కొన్నివేల సంవత్సరముల క్రిందట పురాణకాలంలోనే గర్భస్థ శిశువులకు వినికిడి శక్తి ఉంటుందని  రుజువైందని ఓ  అంతర్జాతీయ విజ్ఞానపత్రిక 'సైన్సు' (Science)  వెల్లడించింది. 

మానవ గర్భస్థ శిశువులు తల్లి గర్భములో ఉన్నప్పుడే  వినుట ద్వారా కంఠ ధ్వనిని, పదాలను కూడా గుర్తిస్తారని  శాస్త్రవేత్తలు చెబుతున్నారు.  ఉత్తర కెరొలినా విశ్వవిద్యాలయమునకు చెందిన (North Carolina University) మనస్తత్వ శాస్త్రవేత్తలు 'ఆంథోని కాస్పర్', 'విలియం పైపర్'లు అపుడే జన్మించిన పదిమంది శిశువులపై ప్రయోగములు జరిపారని తెలుస్తోంది.

 ఒక టేపురికార్డరు (Tape recorder)తో సంబంధము కలిపి..  ఒక పాలబుడ్డి మొనను పీల్చుట ద్వారా శిశువులు ఒక పద్ధతిలో తల్లి స్వరమును.. వేరే టేపురికార్డ్​లో వేరొక  స్త్రీ స్వరమును వినేలా ఈ ప్రయోగమును చేశారు. ఆ తరువాత శిశువులు జన్మించిన తరువాత పసి పిల్లలు తమ తల్లి గొంతును  అధికముగా ఇష్టపడే విధానాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు.  కొన్ని వారముల తరువాత క్రమంగా శిశువులు  గర్భంలో ఉన్నప్పుడే తండ్రి గొంతు వినుటకు ఉత్సాహం చూపుతారని గతంలో చేసిన శాస్త్రవేత్తల ప్రయోగాల ద్వారా తెలుస్తుంది. 

శిశువులు గర్భములో ఉన్న సమయంలో విన్న శబ్దాలు.. మాటల ప్రభావం  జననం తరువాత  చూపుతాయని  శాస్త్రవేత్తలు నిర్ధారించారు. తల్లి మానసికస్థితి ప్రభావం ...పుట్టబోయే బిడ్డపై ఎక్కువగా ఉంటుందని వైద్యనిపుణులు నిర్ధారించారు.  భయం, కోపం, అభిమానం, ప్రేమ, ఆనందం,
దుఃఖం వీటి వలన శరీరంలో కొన్ని రకాల రసాయనాలు నాభి ద్వారా ప్రవహిస్తాయి.  ఆ కెమికల్స్​ గర్భంలోని శిశువును ప్రభావితం చేస్తాయి.

గర్భిణి మానసికంగా ఆందోళన పొందినపుడు గర్భములోనున్న శిశువు తంతున్నట్లు అనిపిస్తుంది. అది ఆ రసాయనముల ప్రభావమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గర్భిణి కడుపుపై అకస్మాత్తుగా, మెరుపువంటి వెలుగు ప్రసరింపజేసినపుడు గర్భములోని శిశువు వెంటనే కళ్లు మూసుకంటారని శాస్త్రవేత్తలు తమ నివేదికలో  తెలిపారు. 

ఆ స్థితిలో బిడ్డ తన తలను ప్రక్కకు తిప్పినట్లు, బిడ్డలో నరముల ఉద్రిక్తత కూడ పెరిగినట్లు వారు గమనించారు. అందుకే కొంతమంది శిశువులు పుట్టే సమయంలో నరాల సమస్యతో జన్మిస్తారు.  గర్భిణి మధురమైన సంగీతము వింటే  బిడ్డకు ఉత్సాహము కలిగుతుందని  పరిశోధకులు గమనించారు.

అందుకే కొంతమంది  సంగీత విద్వాంసులు ఎలాంటి ట్రైనింగ్​ లేకుండానే చాలాబాగా పాటలు పాడతారు. మరికొంతమంది కొన్ని రాగములను  సహజంగానే వయొలిన్ పై వాయిస్తుంటారు.  అయితే శాస్త్రవేత్తల పరిశోధనలో అతని తల్లి వయొలిన్ వాయించడంలో  గొప్ప నిపుణురాలని తెలిసింది.

 అతడు తల్లి గర్భములో నున్నపుడే తల్లి వయొలిన్ వాయించడాన్ని  విని తెలుసుకున్నాడని శాస్త్రవేత్తలు నిర్ధారించి ఋజువు చేశారు. తల్లులకు, వారి గర్భములోని శిశువులకు గల రిలేషన్​ షిప్​  గురించి కెనడాలోని ప్రముఖ మానసిక శాస్త్రవేత్త 'డాక్టర్ థామస్ వెర్నే' 'ది సీక్రెట్ ఆఫ్ ది అన్బోర్న్ ఛైల్డ్' అనే  పుస్తకం వ్రాశారు.