సోషల్ మీడియాలో లక్షల్లో ఫాలోవర్లు. చేతి నిండా ప్రమోషన్లు. ఇప్పుడిప్పుడే వస్తున్న సినీ అవకాశాలు. ఏవీ ఆమెను కాపాడలేకపోయాయి. ఆమెకు మనోధైర్యాన్ని ఇవ్వలేకపోయాయి. చావే శరణ్యమనుకుని ప్రాణం తీసుకుని చనిపోయింది. కన్న వాళ్లకు కన్నీళ్లను మిగిల్చి ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయింది. మధ్యప్రదేశ్ కు చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నిధి తివారీ ఆత్మహత్య చేసుకుని చనిపోయింది.
#BigBreaking: Shoking News from #MP
— Mukund Shahi (@Mukundshahi73) September 27, 2026
Social media influencer #NidhiTiwari hanged herself to death in Singrauli!!
Nidhi had 9 lakh #followers on #FB and over 7 lakh on #Insta . She mostly created dance videos. She originally hailed from Varanasi, UP. The reason for the #suicide is… pic.twitter.com/ayMD0ZdxDO
ఆమె వయసు 30 సంవత్సరాలు. నిధికి ఫేస్‌బుక్‌లో సుమారు 9 లక్షలు, ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 7 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని వింధ్య ప్రాంతానికి చెందిన ఫేమస్ సోషల్ మీడియా పర్సనాలిటీలలో ఒకరు. ఆమె పోస్టులకు వేలల్లో రియాక్షన్స్, ఆమె వీడియోలకు మిలియన్లలో రీచ్.
2024లో నిధి 'మిస్ ప్రెట్టీ ఇండియా' టైటిల్‌ను గెలుచుకుంది. మోడలింగ్, నటన రంగాలలో రాణించేందుకు ప్రయత్నాల్లో ఉంది. ఈ క్రమంలో.. శనివారం భూసా మోడ్‌లోని తన ఇంట్లో నిధి మృతదేహం ఉరి వేసుకున్న స్థితిలో లభ్యమైంది. ఆమె కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించగా, అక్కడ వైద్యులు ఆమె మరణించినట్లు ప్రకటించారు.
►ALSO READ | కారు ఢీ కొట్టిన స్పీడ్కి బైక్పై ఉన్న భార్యాభర్త గాల్లో ఎగిరి 15 అడుగుల దూరంలో పోయి పడ్డారు !
శనివారం సాయంత్రం నిధి ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడాక ప్రాణాలు తీసుకుంది. దీంతో.. ఆమె చనిపోవడానికి ముందు కాల్స్, మెసేజ్ల డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆమె బాయ్ ఫ్రెండ్పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
