స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రేషన్ కార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. తొమ్మిది రకాల సెక్యూరిటీ ఫీచర్లతో పటిష్ట భద్రత

స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రేషన్ కార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. తొమ్మిది రకాల సెక్యూరిటీ ఫీచర్లతో పటిష్ట భద్రత
  • తొమ్మిది రకాల సెక్యూరిటీ ఫీచర్లతో పటిష్ట భద్రత
  • స్పర్శతో గుర్తించే ఎంబోస్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అక్షరాలు.. యూవీ లైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే కనిపించేలా లోగో
  • ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రిప్టెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యూఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో డిజిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఐడెంటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..డూప్లికేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు చెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు:  రాష్ట్రంలో కొత్తగా జారీ చేయనున్న స్మార్ట్​రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డులను మరింత భద్రంగా, డూప్లికేట్లకు తావులేకుండా రూపొందించేందుకు సివిల్​ సప్లయ్స్ శాఖ లేటెస్ట్​టెక్నాలజీని వినియోగిస్తోంది. పాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టులు, బ్యాంకు నోట్లు, కీలక ప్రభుత్వ పత్రాల ముద్రణలో ఉపయోగించే భద్రతా ప్రమాణాలను ఈ కార్డుల తయారీలో వాడుతున్నది. కార్డు అసలుదనాన్ని సులభంగా గుర్తించడంతోపాటు లబ్ధిదారుల వివరాలను డిజిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ధ్రువీకరించేందుకు వీలుగా మొత్తం 9  రకాల సెక్యూరిటీ ఫీచర్లతో నమూనాను రూపొందించింది.

కార్డు ముందు భాగంలో సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి, సివిల్​ సప్లయ్స్​శాఖ మంత్రి ఉత్తమ్‌‌‌‌కుమార్‌‌‌‌రెడ్డి ఫొటోలతోపాటు కార్డు యజమాని వివరాలు, రేషన్‌‌‌‌ దుకాణం నంబరు తదితర సమాచారాన్ని పొందుపరచనున్నారు. సివిల్​ సప్లయ్స్​ కమిషనర్‌‌‌‌ అధికారిక సంతకానికీ కార్డులో స్థానం కల్పించారు. కార్డు ముందు, వెనుక భాగాల్లో కనిపించే, కనిపించని, స్పర్శ ద్వారా గుర్తించే, డిజిటల్‌‌‌‌గా ధ్రువీకరించే సెక్యూరిటీ ఫీచర్లను పొందుపరిచారు. 

తెలంగాణ ప్రభుత్వ అధికారిక చిహ్నంతో కూడిన సెక్యూర్‌‌‌‌ హోలోగ్రామ్‌‌‌‌, ‘గవర్నమెంట్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ తెలంగాణ’ రిలీఫ్‌‌‌‌ టెక్స్ట్‌‌‌‌, సూక్ష్మ అక్షరాలతో కూడిన మైక్రో టెక్స్ట్‌‌‌‌ ఇందులో ఉన్నాయి. సాధారణ ప్రింటింగ్‌‌‌‌ పద్ధతులతో వీటిని యథాతథంగా డూప్లికేట్​ చేయడం.. కాపీ చేయడం కష్టంగా ఉండేలా డిజైన్‌‌‌‌ చేశారు.

యాంగిల్​ మార్చితేనే కనిపిస్తాయి

స్మార్ట్​ రేషన్​ కార్డులో డ్యూయల్‌‌‌‌ హిడెన్‌‌‌‌ ఇమేజెస్‌‌‌‌ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ‘జీవోటీజీ’ తదితర రహస్య గుర్తులు నిర్దిష్ట యాంగిల్​(కోణం)లో లేదా మాగ్నిఫికేషన్‌‌‌‌ ద్వారా మాత్రమే కనిపించేలా రూపొందించారు. దీంతో కార్డు ఒరిజినాలిటీని పరిశీలించేందుకు అదనపు అవకాశం లభిస్తుంది. 

తెలంగాణ ప్రభుత్వ చిహ్నంతో కూడిన వాటర్‌‌‌‌మార్క్‌‌‌‌ను కార్డులో పొందుపరుస్తారు. సాధారణ కంటికి కనిపించని యూవీ (అల్ట్రా వయొలెట్‌‌‌‌) లోగోను ప్రత్యేకంగా ముద్రించనున్నారు. యూవీ రేస్‌‌‌‌లో పరిశీలించినప్పుడు మాత్రమే ఈ గుర్తు కనిపిస్తుంది. కార్డు నిజమైనదా? డూప్లికేట్‌‌‌‌దా? అనే విషయాన్ని త్వరగా నిర్ధారించేందుకు ఈ సదుపాయం ఉపయోగపడనున్నది.

ఎన్‌‌‌‌క్రిప్టెడ్‌‌‌‌ క్యూ ఆర్‌‌‌‌ కోడ్‌‌‌‌తో డిజిటల్‌‌‌‌ ధ్రువీకరణ

కార్డు వెనుక భాగంలో 20×20 మిల్లీ మీటర్ల పరిమాణంలో ఎన్‌‌‌‌క్రిప్టెడ్‌‌‌‌ క్యూఆర్‌‌‌‌ కోడ్‌‌‌‌ను ముద్రించనున్నారు. ఇందులో డిజిటల్‌‌‌‌గా సేఫ్టీ సమాచారాన్ని పొందుపరచి, అథరైజ్డ్‌‌‌‌ సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌ లేదా స్కానింగ్‌‌‌‌ వ్యవస్థల ద్వారా లబ్ధిదారుల వివరాలను ధ్రువీకరించేలా వ్యవస్థను రూపొందించారు. 

డేటాలో అనధికార మార్పులు, డూప్లికేషన్‌‌‌‌, నకిలీ కార్డుల తయారీని అడ్డుకోవడం ఈ విధానం ప్రధాన ఉద్దేశం. ఇక కార్డుపై చేతితో తాకినప్పుడు గుర్తించగలిగేలా కొన్ని అక్షరాలు, వివరాలను ఎంబోస్‌‌‌‌ చేసే విధానాన్ని  ప్రతిపాదించారు. దీనివల్ల దృష్టితోనే కాకుండా స్పర్శ ద్వారా కూడా కార్డు సెక్యూరిటీ ఫీచర్స్‌‌‌‌ను పరిశీలించే అవకాశం ఉంటుంది.

భూతద్ధంతోనే కనిపించే మైక్రో టెక్స్ట్‌‌‌‌

కార్డులో అత్యంత సూక్ష్మ పరిమాణంలో మైక్రో టెక్స్ట్‌‌‌‌ను ముద్రిస్తారు. సాధారణంగా కంటికి స్పష్టంగా కనిపించని ఈ అక్షరాలు భూతద్దం ద్వారా పరిశీలించినప్పుడు మాత్రమే గుర్తించగలిగేలా ఉంటాయి. సాధారణ ప్రింటింగ్‌‌‌‌ యంత్రాలతో వీటిని డూప్లికేట్​ చేయడం కష్టతరం కానుంది. 

కార్డు బ్యాక్‌‌‌‌గ్రౌండ్‌‌‌‌లో గిల్లోష్‌‌‌‌ ప్యాటర్న్‌‌‌‌ అనే సంక్లిష్ట రేఖా ఆకృతిని ఉపయోగిం చనున్నారు. మ్యాథమెటిక్స్​పరమైన కచ్చితత్వంతో రూపొందించే ఈ డిజైన్‌‌‌‌ను సాధారణంగా ఫోర్జరీ చేయడం కష్టంగా ఉంటుంది. కార్డులోని ఇతర సెక్యూరిటీ ఫీచర్స్‌‌‌‌తో కలిపి ఇది అదనపు సెక్యూరిటీ లేయర్‌‌‌‌‌‌‌‌గా పనిచేయనుంది.