ఎల్ నినోను అందరం కలిసి ఎదుర్కోవాలె.. ప్రజ‌‌ల‌‌కు స్పీక‌‌ర్ గ‌‌డ్డం ప్రసాద్ కుమార్ పిలుపు

ఎల్ నినోను అందరం కలిసి ఎదుర్కోవాలె.. ప్రజ‌‌ల‌‌కు స్పీక‌‌ర్ గ‌‌డ్డం ప్రసాద్ కుమార్ పిలుపు

వికారాబాద్​, వెలుగు : భార‌‌త్ తో పాటు ప్రపంచ దేశాలను వణికిస్తున్న ప్రకృతి విప‌‌త్తు ఎల్‌‌నినో ను ప్రజ‌‌లంద‌‌రం క‌‌లిసి ఎదుర్కొవాల‌‌ని అసెంబ్లీ స్పీకర్​గ‌‌డ్డం ప్రసాద్ కుమార్ పిలుపునిచ్చారు. వికారాబాద్ లో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో శుక్రవారం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్  చెక్కులను మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్యతో కలిసి పంపిణీ చేశారు. ఈ సంద‌‌ర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు, రైతులు..ప్రజా ప్రభుత్వం, వ్యవ‌‌సాయ శాఖ అధికారుల స‌‌ల‌‌హాలు, సూచ‌‌న‌‌లు పాటించాలన్నారు. సాగుకు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలన్నారు.  హైద‌‌రాబాద్ ట్యాంక్ బండ్ త‌‌ర‌‌హాలో వికారాబాద్ టౌన్ లోశివసాగర్ చెరువును సుంద‌‌రీక‌‌ర‌‌ణ చేస్తామ‌‌ని హామీ ఇచ్చారు. మున్సిపల్ చైర్ పర్సన్ అర్థ సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.