గడచిన 10 రోజులుగా గ్యాప్ లేకుండా పెరుగుతూపోతున్న గోల్డ్ ధరలు శ్రావణ శుక్రవారం రోజున దిగొచ్చాయి. దీంతో శుభకార్యాల కోసం ఆభరణాలు షాపింగ్ చేద్దాం అని ప్లాన్ చేసుకుంటున్న రెండు తెలుగు రాష్ట్రాల మహిళలకు ఊరట లభించింది. పూజలు, వ్రతాల కోసం షాపింగ్ చేద్దాం అనుకుంటున్న వాళ్లు తమ సమీప నగరాల్లోని రిటైల్ విక్రయ ధరలను పరిశీలించి ముందుకు సాగటం మంచిది.
ఆగస్టు 14న బంగారం రేట్లు తగ్గాయి. ఆగస్టు 13 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా రూ.71 పెరిగింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 289గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 015గా కొనసాగుతోంది.
ALSO READ : టాటా సన్స్ చైర్మన్ రేసులో టీవీ నరేంద్రన్..!
శుక్రవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. ఆగస్టు 14, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతోంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి రూ.5వేలు తగ్గి రూ.2లక్షల 55వేలుగా ఉంది. అంటే గ్రాము దాదాపు రూ.255 దగ్గర అమ్మకాలు జరుగుతున్నాయి.
