శ్రీదేవిది సహజ మరణం కాదు.. బోనీ కపూర్ షాకింగ్ కామెంట్స్!

శ్రీదేవిది సహజ మరణం కాదు.. బోనీ కపూర్ షాకింగ్ కామెంట్స్!

భారతీయ సినీ ప్రపంచంలో 'అతిలోక సుందరి'గా చెరగని ముద్ర వేసిన నటి శ్రీదేవి. ఆమె పేరు చెబితేనే ఇప్పటికీ సినీ అభిమానుల కళ్ల ముందు ఎన్నో పాత్రలు కదలాడతాయి. బాలనటిగా మొదలైన ప్రయాణం.. స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తిరుగులేని నటిగా క్రేజ్ ను సంపాదించుకుంది.  ఆగస్టు 13న ఆమె జయంతి సందర్భంగా అభిమానులంతా ఆ తీపి జ్ఞాపకాలను మరో సారి గుర్తుచేసుకుంటున్నారు. 

ఆ ఒక్క తప్పే ప్రాణాల మీదకు తెచ్చిందా?

అయితే, 2018 ఫిబ్రవరి 24న దుబాయ్ హోటల్ గదిలో ఆమె ఆకస్మికంగా కన్నుమూయడం ఇండస్ట్రీని, దేశాన్ని కుదిపేసింది. బాత్‌టబ్ మునిగి మరణించిన ఆ ఘటన వెనుక ఎన్నో అనుమానాలు, వివాదాలు ముసురుకున్నాయి. చివరికి దుబాయ్ పోలీసుల ఫోరెన్సిక్ నివేదికలో ఇది ప్రమాదవశాత్తూ జరిగిన మునకగా పేర్కొన్నారు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె భర్త, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ ఒక ఇంటర్వ్యూలో ఆ నాటి భయానక క్షణాలను, రహస్యాలను బయటపెట్టారు. 'అది సహజ మరణం కాదు... కేవలం ప్రమాదవశాత్తు జరిగిన ఘోరం' అంటూ స్పష్టం చేశారు.

దుబాయ్ లో లై డిటెక్టర్ టెస్ట్...

ఇండియన్ మీడియా నుంచి తీవ్రమైన ఒత్తిడి పెరగడంతో దుబాయ్ పోలీసులు తనను దాదాపు 48 గంటల పాటు విచారించారని  బోనీ కపూర్ తెలిపారు. తనను లై డిటెక్టర్  టెస్ట్ కూడా చేశారని చెప్పారు. ఏ రకమైన కుట్ర , ఫౌల్ ప్లే లేదని తేలాకే తనకు క్లీన్ చిట్ ఇచ్చారు అని బోనీ తెలిపారు. దీంతో శ్రీదేవి  ప్రమాదవశాత్తూ మరణించారని దుబాయ్ పోలీసులు క్లారిటీ ఇచ్చారు.

డైట్ తెచ్చిన ముప్పు..

శ్రీదేవి మరణానికి కారణం ఆమె పాటించిన అత్యంత కఠినమైన డైటింగ్ అని బోనీ వెల్లడించారు. వెండితెరపై సన్నగా, నాజూగ్గా కన్పించేందుకు ఆమె ఉప్పు లేని ఆహారాన్ని తీసుకునేవారిని చెప్పారు. ఉప్పుతో కూడిన ఆహారం తీసుకుంటే ముఖం ఉబ్బినట్లు కన్పించేదన్న భావనలో శ్రీదేవి ఉండేవారని తెలిపారు. ఉప్పు పూర్తిగా మానేయడంతో ఆమె లో బీపీ ( Low BP )తో బాధపడేవారు. పెళ్లయినప్పటి నుంచి ఆమె చాలా సార్లు కళ్లు తిరిగి పడిపోయేవారని బోనీ గుర్తుచేశారు.

ALSO READ : Jr NTR: కిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయిన జూనియర్ ఎన్టీఆర్.. 

నాగార్జున చెప్పిన షాకింగ్ నిజం.. 

శ్రీదేవి మరణాంతరం పరామర్శించడానికి వచ్చిన నటుడు నాగార్జున ఒక విషయాన్ని పంచుకున్నారు. గతంలో ఒక షూటింగ్ సమయంలో కూడా ఇలాగే తీవ్రమైన డైటింగ్ చేస్తూ, బాత్‌రూమ్‌లో కళ్ళుతిరిగి పడిపోయి శ్రీదేవి పళ్ళు విరిగిపోయాయని చెప్పుకొచ్చారు. సలాడ్స్ తింటున్నా కనీసం కాస్త ఉప్పు చల్లుకోమని కుటుంబ వైద్యులు, బోనీ, కుమార్తెలు ఎంత బ్రతిమాలినా శ్రీదేవి వినలేదు. ఆ అందం కోసం చేసిన అమితమైన త్యాగమే, చివరికి బాత్‌టబ్‌లో కళ్ళు తిరిగి పడిపోయి ప్రాణాలు కోల్పోయేలా చేసిందని బోనీ కపూర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.