Jr NTR: కిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయిన జూనియర్ ఎన్టీఆర్.. డాక్టర్లు ఏం చెప్పారంటే?

Jr NTR: కిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయిన జూనియర్ ఎన్టీఆర్.. డాక్టర్లు ఏం చెప్పారంటే?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రి నుంచి గురువారం (ఆగస్టు 13) డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని కిమ్స్ యాజమాన్యం అధికారిక హెల్త్ బులెటిన్ ద్వారా వెల్లడించింది. కిమ్స్ ఆర్థోపెడిక్ నిపుణులు డా. ఆర్.ఏ. పూర్ణచంద్ర తేజస్వి మరియు డా. నితిన్ బెజ్జంకి ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌కు షోల్డర్ సర్జరీ విజయవంతంగా నిర్వహించినట్లు బులెటిన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, కోలుకునే దిశగా మంచి పురోగతి సాధిస్తున్నారని వైద్యులు తెలిపారు. భుజానికి గాయం కారణంగా గత కొద్ది రోజులుగా అసౌకర్యంతో బాధపడుతున్న ఆయన, బుధవారం ఆగస్ట్ 12న ఉదయం శస్త్రచికిత్స కోసం ఆస్పత్రిలో చేరారు.

హెల్త్ బులెటిన్ విడుదల

కిమ్స్ ఆర్థోపెడిక్ నిపుణులు డాక్టర్ పూర్ణచంద్ర తేజస్వి మరియు డాక్టర్ నితిన్ బెజ్జంకి ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌కు ఆర్థ్రోస్కోపిక్ (Arthroscopic) షోల్డర్ సర్జరీ విజయవంతంగా నిర్వహించారు. అనంతరం విడుదల చేసిన మెడికల్ బులెటిన్‌లో ఆపరేషన్ పూర్తిగా సక్సెస్ అయిందని, ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు.

కిమ్స్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ సందీప్ సంబిత్ సాహూ విడుదల చేసిన ప్రకటనలో, శస్త్రచికిత్స అనంతర పరిశీలన పూర్తయ్యాక గురువారం ఎన్టీఆర్‌ను డిశ్చార్జ్ చేసినట్లు వెల్లడించారు. వైద్యుల సూచన మేరకు ఆయన కొద్ది వారాల పాటు విశ్రాంతి తీసుకుంటూ ఫిజియోథెరపీ కొనసాగించనున్నారు. కాగా, ఎన్టీఆర్ డిశ్చార్జ్ అయిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ALSO READ : టాలీవుడ్లో మహిళా కథల జోష్..

మరో వైపు తన భుజానికి సర్జరీ సక్సెస్ అయిందని ఎన్టీఆర్ X వేదికగా పోస్ట్ చేశారు.. తాను త్వరగా కోలుకోవాలని ఆకాక్షించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. నేను క్షేమంగా ఉన్నా.. మీ అందరి మద్దతే నాకు ప్రతి రోజూ శక్తి నిస్తుంది. కిమ్స్ వైద్య బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు.  మీ అందరి ప్రేమ, ప్రార్థనలకు కృతజ్ఞతలు .. త్వరలోనే కలుద్దాం అంటూ తారక్ పోస్ట్ చేశారు.

‘లూగర్’గా గర్జించనున్న ఎన్టీఆర్..

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ ఎవైటెడ్ కాంబినేషన్ అయిన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ల మూవీ 'డ్రాగన్'. 1967 నాటి అంతర్జాతీయ ఓపియమ్ (నల్లమందు) మాఫియా, 'ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ' నేపథ్యంలో మూవీ రూపొందుతుంది. ఎన్టీఆర్ ఇందులో ‘లూగర్’ అనే పవర్‌ఫుల్ రోల్‌లో సబ్‌స్టాన్స్ స్మగ్లింగ్ సిండికేట్‌ను గడగడలాడించే పాత్రలో కనిపించనున్నారు. రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, అనిల్ కపూర్, బిజు మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ జూన్ 11, 2027న థియేటర్లను రూల్ చేయనుంది.