Hushar Pittalu Review: ‘హుషార్ పిట్టలు’ ప్రీమియర్స్కు పాజిటివ్ టాక్.. అడల్ట్ కామెడీతో వచ్చిన ఈ మూవీ కథేంటి?

Hushar Pittalu Review: ‘హుషార్ పిట్టలు’ ప్రీమియర్స్కు పాజిటివ్ టాక్.. అడల్ట్ కామెడీతో వచ్చిన ఈ మూవీ కథేంటి?

అన్షు, వాసవి గణేశన్‌‌‌‌ జంటగా బిక్షు దర్శకత్వంలో వెంకట్‌‌‌‌ యాదవ్‌‌‌‌ నిర్మించిన  చిత్రం ‘హుషార్ పిట్టలు’. ఆగస్టు 15న సినిమా విడుదల కానుంది. ఏషియన్‌‌‌‌, సురేష్‌‌‌‌ ఫిలింస్‌‌‌‌ సంస్థలు విడుదల చేస్తున్నాయి. గురువారం ప్రీ రిలీజ్ ప్రెస్‌‌‌‌మీట్ నిర్వహించారు. అయితే, మూవీ ఆగస్ట్ 15న మూవీ రిలీజ్ అవుతున్నప్పటికీ.. మూడు రోజుల ముందు నుంచే పలు నగరాల్లో ఈ సినిమా ప్రీమియర్స్ వేశారు. సినిమా చుసిన ఆడియన్స్ నుంచి క్రేజీ టాక్ వస్తుంది. లవ్, రొమాన్స్తో పాటు యూత్కు మెసేజ్ ఇచ్చేలా సినిమా ఉందని ఆడియన్స్ సోషల్ మీడియాలో అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మేకర్స్ సైతం ఇంట్రెస్టింగ్ విశేషాలు పంచుకున్నారు. అతిథిగా హాజరైన నిర్మాత బెక్కెం వేణుగోపాల్ ఈ సినిమా ప్రతి ఒక్కరినీ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్ చేస్తుందని చెబుతూ టీమ్‌‌‌‌కు బెస్ట్ విషెస్ చెప్పారు.

హీరో అన్షు మాట్లాడుతూ ‘ఈ  సినిమాతో హిట్టు కొట్టబోతున్నా అని తొడ గొట్టి చెబుతున్నా.  మా మూవీని సపోర్ట్ చేసిన సురేష్ బాబు థ్యాంక్స్’ అని చెప్పాడు.  ఇది ఒక జనరేషన్‌‌‌‌ను మార్చే సినిమా అని హీరోయిన్ వాసవి గణేశన్ చెప్పింది.  ఆల్రెడీ ప్రీమియర్లకు మంచి రెస్పాన్స్ వస్తోందని, అన్ని ఏజ్ గ్రూప్‌‌‌‌ వాళ్లకు నచ్చేలా సినిమా ఉంటుందని దర్శక నిర్మాతలు తెలియజేశారు. టీమ్ అంతా పాల్గొన్నారు.

హుషార్ పిట్టలు కథ విషయానికొస్తే..

టెన్త్ పూర్తయ్యాక రవి (అన్ష్), చిట్టి (వాసవి గణేశన్) ఒకరినొకరు ఇష్టపడతారు. తెలిసీ తెలియని వయసులో ప్రేమ పేరుతో హద్దులు దాటిన వీరిద్దరి జీవితం అనుకోని మలుపు తిరుగుతుంది. కుటుంబాలకు నిజం తెలిసిన తర్వాత ఏం జరుగుతుంది? వారి ప్రేమకు ఎలాంటి ముగింపు దక్కుతుంది? అనేదే సినిమా ప్రధాన కథ.

మూవీ ఎలా ఉంది?

హుషార్ పిట్టలు ఫస్టాఫ్ లో అడల్ట్ కామెడీ, డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో నవ్విస్తూ సాగుతుంది. సెకండాఫ్ లో రవి–చిట్టి జీవితాలు అనుకోని మలుపు తిరగడంతో ఎమోషన్, కుటుంబ బంధాలు, బలమైన సందేశం ప్రధానంగా నిలుస్తాయి.

►ALSO READ | Dharman: రజినీ–కమల్ మూవీ అప్డేట్.. ది డెడ్లీ డాక్టర్ వీడియో వైరల్..

చెడు స్నేహాలు, ఫోన్ల ప్రభావం, యుక్తవయసు నిర్ణయాలు పిల్లల జీవితాలను ఎలా మార్చేస్తాయో దర్శకుడు చూపించాడు. అడల్ట్ కంటెంట్ ఉన్నప్పటికీ, చూడదగ్గ మెసేజ్‌తో సినిమా అలరించనుంది. ఈ వీకెండ్ కు యూత్ కు కనెక్ట్ అయ్యే సినిమా హుషారు పిట్టలు.