Dharman: రజినీ–కమల్ మూవీ అప్డేట్.. ది డెడ్లీ డాక్టర్ వీడియో వైరల్..

Dharman: రజినీ–కమల్ మూవీ అప్డేట్.. ది డెడ్లీ డాక్టర్ వీడియో వైరల్..

రజినీకాంత్ హీరోగా కమల్ హాసన్‌‌‌‌ నిర్మిస్తున్న చిత్రం ‘ధర్మన్‌‌‌‌’. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టైటిల్, ఫస్ట్ లుక్‌‌‌‌ పోస్టర్‌‌‌‌‌‌‌‌కు పాజిటివ్‌‌‌‌ రెస్పాన్స్‌‌‌‌ వచ్చింది. ది డెడ్లీ డాక్టర్ అనే ట్యాగ్‌‌‌‌లైన్‌‌‌‌తో వస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఓ షెడ్యూల్‌‌‌‌ షూటింగ్‌‌‌‌ను ఇప్పటికే పూర్తి చేసిన మేకర్స్‌‌‌‌.. తాజాగా సెకండ్ షెడ్యూల్‌‌‌‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియోలో రజినీకాంత్ స్క్రీన్‌‌‌‌ ప్రజెన్స్‌‌‌‌ అబ్బురపరిచింది. సిమ్రాన్‌‌‌‌, రాశీఖన్నా హీరోయిన్స్‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్‌‌‌‌‌‌‌‌ సంగీతం అందిస్తున్నాడు. నేషనల్ అవార్డ్‌‌‌‌ విన్నింగ్‌‌‌‌ ఫైట్ మాస్టర్స్‌‌‌‌ ‘అన్బరివ్‌‌‌‌’ యాక్షన్ కొరియోగ్రాఫర్స్‌‌‌‌గా వర్క్ చేస్తున్నారు. కమల్ హాసన్‌‌‌‌తో కలిసి మహేంద్రన్‌‌‌‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి డిస్నీ సంస్థ సహ-నిర్మాతగా వ్యవహరిస్తోంది. రజినీకాంత్, కమల్ హాసన్‌‌‌‌ కాంబినేషన్‌‌‌‌లో వస్తున్న చిత్రం కావడంతో హ్యూజ్‌‌‌‌ ఎక్స్‌‌‌‌పెక్టేషన్స్‌‌‌‌ నెలకొన్నాయి.

అశ్వత్ మారిముత్తు విజన్..

‘ఓ మై కడవులే’, ‘డ్రాగన్’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అశ్వత్ మారిముత్తు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రజనీకాంత్‌కు వీరాభిమాని అయిన దర్శకుడు అశ్వత్ మారిముత్తు తన విజన్‌తో తలైవాను కొత్త అవతారంలో చూపించేందుకు సిద్ధమయ్యాడు. ‘ధర్మన్’లో మాస్, ఎమోషన్, యాక్షన్‌ల సమ్మేళనంగా సూపర్ స్టార్‌ను ప్రజెంట్ చేయబోతున్నట్లు ఫస్ట్ లుక్, మేకింగ్ వీడియోలు స్పష్టం చేస్తున్నాయి.

అంతేకాకుండా దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత రజనీకాంత్, కమల్ హాసన్ వృత్తిపరంగా కలుస్తుండటం ఈ ప్రాజెక్ట్‌కు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది.