మహబూబ్ నగర్ జిల్లాలోని భూత్పూర్ దగ్గర హైదరాబాద్-బెంగళూర్ హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి పుదుచ్చేరి వెళ్తున్న బస్సు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. జిల్లా ఎస్పీ జానకి ఘటన స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ఓవర్ స్పీడే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
