జ్యోతిష్యం : కన్యారాశిలో దగ్గరగా బుధుడు... గురుడు.. యతి యోగం ఎఫెక్ట్.. నాలుగు రాశుల వారికి పండుగే..!

జ్యోతిష్యం  : కన్యారాశిలో దగ్గరగా బుధుడు... గురుడు.. యతి యోగం ఎఫెక్ట్.. నాలుగు రాశుల వారికి పండుగే..!

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సంపద, సంతోషాలకు కారకుడైన దేవ గురువు అయిన  గురుడు... బుధుడిని తెలివితేటలు, వ్యాపారం, కమ్యూనికేషన్‌కు ప్రతీకగా భావించే బుధుడు కన్యారాశిలో అతి దగ్గరగా అంటే సున్న డిగ్రీల దగ్గరకు ఆగస్టు 15 సాయంత్రం 4:51 గంటలకు రాబోతున్నాయి.దీంతో కన్యారాశిలో యతియోగం ఏర్పడనుంది.   జ్యోతిష్య సిద్దాంతులు తెలిపిన వివరాల ప్రకారంగా ఈ పవిత్ర కలయికతో నాలుగు రాశుల ( వృషభ, మకర, ధనస్సు, మీన)  వారికి అష్టైశ్వర్యాలు లభించడమే కాకుండా.. అద్బుతమైన రోజులు మొదలవుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఇప్పుడు ఆ రాశుల గురించి తెలుసుకుందాం. . .


వృషభ రాశి :  ఈ రాశి వారికి కన్యారాశిలో గురుడు.. బుధుడు సున్నా డిగ్రీల దూరంలో ఉండటం వలన ఏర్పడే యతి యోగం వలన ఈ రాశి వారికి అత్యంత శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, జీతాల పెంపు వంటి శుభవార్తలు వింటారు.. . ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి మంచి సమయం.  ఉద్యోగస్తులు సహోద్యోగుల నుంచి  ప్రశంసలు అందుకుంటారు. బదిలీ కోసం ప్రయత్నిస్తుంటే .. అనుకున్న ఫలితాన్ని పొందుతారు.  ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  వ్యాపారస్తులు అధిక లాభాలు గడించే అవకాశం ఉంది. కొత్త ఆదాయ మార్గాలు లభించడమే కాకుండా.. ఊహించని ధనలాభాలు కూడా కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో ఆనందోత్సాహాలు కూడా రెట్టింపు అవుతాయి. ఆర్ధిక స్థితిగతులు కూడా మెరుగుపడే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి. డబ్బు పొదుపు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.

మకర రాశి : కన్యారాశిలో యతి యోగం వలన  ఈ రాశి వారికి  కెరీర్​ విషయంలో జాక్​ పాట్​ కలుగుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు .  కొత్త ప్రాజెక్ట్​లు చేపట్టే అవకాశం ఉంది.  సమాజంలో గౌరవం కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ప్రతి పనిలో విజయం సాధిస్తారు. బ్యాంక్​ బ్యాలెన్స్​ పెరిగే అవకాశాలున్నాయి. పూర్వీకుల ఆస్తి లభిస్తుంది. సంతోషంగా, సంతృప్తికరమైన ఆర్థిక లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులకు ఈ సమయం జాబ్​ మారేందుకు అనుకూలమైన సమయమని పండితులు చెబుతున్నారు.  ఉన్నతాధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది.కొత్త ఆదాయ మార్గాలు అనుకోకుండా ఏర్పడటంతో సంపద పెరుగుతుందని పండితులు చెబుతున్నారు.  వ్యాపారస్తులు అధికంగా లాభాలు గడిస్తారు.  కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలంగా ఉంటుంది.  పెళ్లి.. ప్రేమ విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

ధనుస్సు రాశి :  కన్యారాశిలో యతి యోగం వలన ఈ రాశి వారికి విపరీతంగా ధన లాభం కలుగుతుంది.  ఆర్థిక ఇబ్బందులు సునాయాశంగా పరిష్కారమవుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా లభిస్తుంది.. చేతినిండా డబ్బుతో సంతోషకరమైన జీవితాన్ని గడిపే అవకాశాలున్నాయి. ప్రతి పనిలో కూడా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు  ప్రమోషన్ తో పాటు  జీతభత్యాలు రెట్టింపవుతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి.   ఎప్పటి నుంచి పెండింగ్ లో ఉన్న పనులు పరిష్కారమవుతాయి. .  ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది.   కొత్తగా ఇంటి నిర్మాణం చేపట్టే అవకాశం ఉంది.    ప్రేమ వ్యవహారాలలో   ఎలాంటి ఇబ్బందులు ఉండవు. పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వారికి ఆశించిన సంబంధం కుదురుతుంది. 

మీన రాశి  : ఈ రాశి వారిఇ కన్యారాశిలో యతియోగం కారణంగా అన్ని విషయాల్లో కూడా అదృష్టం విపరీతంగా పెరుగుతుంది. ఒక్కసారిగా పెద్ద మొత్తంలో ధనం చేతికి అందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. పాత పెట్టుబడుల నుంచి రాబడులు అధికంగా ఉంటాయి. కేరీర్​ విషయంలో ముఖ్యమైన నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు అనుకోకుండా ప్రమోషన్​ వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. . ఆర్థిక వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. కొత్త ఆలోచనలతో తీసుకున్న నిర్ణయాలు.. కొత్త ప్రణాళికలు కలసి వస్తాయి.  ఉద్యోగస్తులకు అధికారుల మద్దతు పుష్కలంగా ఉంటుంది.  ప్రమోషన్ రావడం.. వేతనం పెరగడం ... కొన్ని కొత్త బాధ్యతలు తీసుకోవలసి వస్తుంది.  వ్యాపారస్తులకు అన్ని విధాల కలసి వస్తుంది.  అనుకోకుండా లాభాలు వస్తాయి.  కొత్తగా  పెట్టుబడులు పెట్టే వారు ఊహించని లాభాలు పొందుతారు. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది.

 
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.