ఇదేం బౌలింగ్ సామీ.. సొంతగడ్డపై ఆస్ట్రేలియాను వణికించిన బంగ్లా యువ పేసర్

ఇదేం బౌలింగ్ సామీ.. సొంతగడ్డపై ఆస్ట్రేలియాను వణికించిన బంగ్లా యువ పేసర్

డార్విన్‌లోని మార్రారా ఓవల్ గ్రౌండ్ వేదికగా జరుగుతోన్న తొలి టెస్ట్‎లో బంగ్లా యువ పేసర్ హసన్ మహమూద్ ఆస్ట్రేలియాను గడగడలాడించాడు. పేస్‎కు స్వర్గధామమైన ఆసీస్ పిచ్‎లపై బుల్లెట్ లాంటి బంతులతో కంగారులను వణికించాడు. సొంతగడ్డపై పేస్, సింగ్‎తో ప్రత్యర్థులకు సవాల్ విసిరే ఆసీస్‎ను అదే పేస్, అదే స్వింగ్‎తో బంగ్లా యువ కెరటం దెబ్బకొట్టాడు. హసన్ ఆరు వికెట్లతో విభృంభించడంతో తొలి ఇన్నింగ్స్‎లో ఆస్ట్రేలియా 198 పరుగులకే కుప్పకూలింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియాకు ఇదే అత్యల్ప స్కోరు.

మార్రారా ఓవల్ గ్రౌండ్ వేదికగా బంగ్లాతో జరుగుతోన్న ఈ తొలి టెస్ట్‎లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‎కు దిగిన ఆస్ట్రేలియా జట్టు 53 ఓవర్లలో కేవలం 198 పరుగులకే ఆలౌట్ అయింది. బంగ్లా యంగ్ పేసర్ హసన్ మహమూద్ (6/55) దెబ్బకు ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. స్టీవ్ స్మిత్ (71 ) ఒక్కడే హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. 

ఐదుగురు ప్లేయర్ సింగిల్ డిజిట్‎కే పెవిలియన్ చేరారు. అనంతరం బ్యాటింగ్‏కు దిగిన బంగ్లా తొలి రోజు ఆట ముగిసేసరికి తమ మొదటి ఇన్నింగ్స్‌లో 1 వికెట్ నష్టానికి 96 పరుగులు చేసి ఆటపై పట్టు సాధించింది. కాగా, 23 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ ఇదే కావడంతో డార్విన్ మ్యాచ్‌కు ప్రాముఖ్యత సంతరించుకుంది.