అద్దె ఇంటి కోసం పంచాయితీ.. ఇల్లు నాది అన్న భార్య.. చంపేసి తానూ చనిపోయిన భర్త!

 అద్దె ఇంటి కోసం పంచాయితీ.. ఇల్లు నాది అన్న భార్య.. చంపేసి తానూ చనిపోయిన భర్త!

కొత్తగా పెళ్లయి ఉపాధి కోసం సిటీకి షిఫ్ట్ అవుతున్న జంటల జీవన విధానం ఎలా ఉంటుందో ఊర్లో ఉండే తల్లిదండ్రులకు తెలియదు. రోజుకోసారి ఫోన్ మాట్లాడి బానే ఉంటున్నారులే అని సంతృప్తి పడటం తప్ప. కానీ కొందరు భార్యాభర్తలు ఇది ఒక సమస్యేనా.. అనిపించే సమస్యలతో నిత్యం గొడవలు.. చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకునే వరకు వెళ్తున్నారు. ఈ స్టోరీ కూడా అలాంటిదే.

బెంగళూరుకు చెందిన భార్యాభర్తల మధ్య అద్దె ఇంటి కోసం పంచాయితీ.. ప్రాణాల మీదికి తెచ్చింది. ఇల్లు నాది భార్య అనటంతో చిర్రెత్తుకొచ్చిన భర్త.. ఆమెను చంపేసి తానూ చనిపోయిన ఘటన నార్త్ బెంగళూరు లగ్గేరే ప్రాంతంలో కలకలం రేపింది. 

సుమంత్ జైన్(32) ఇంజినీర్. అతని భార్య పద్మావతి (29) సాఫ్ట్ వేర్ ఇంజినీర్. లగ్గేరేలోని రాజేశ్వరి నగర్ లో ఒక ఇంట్లో నాలుగు నెలలుగా రెంట్ కు ఉంటున్నారు. అయితే సుమంత్ తమ కూతురునిచంపేసి తనూ చనిపోయాడని  పద్మావతి పేరెంట్స్ ఆరోపిస్తున్నారు.

ఏం జరిగింది.?

నందిని లేయౌట్ లో పనిచేస్తున్న సుమంత్ కు.. ధర్వాడ్ జిల్లాకు చెందిన పద్మావతితో నాలుగేళ్ల క్రితం పెళ్లయింది. ఇంకా పిల్లలు లేరు. పద్మావతి వైట్ ఫీల్డ్ అనే  కంపెనీలో ఇంజినీర్ గా పనిచేస్తోంది. ఆమెది  2026 ఆగస్టు 13 రాత్రి 1.30 గంటలకు తన తల్లికి వాట్సాప్ మెస్సేజ్ చేశాడు. తనకూ, తన భార్యకు గొడవ జరిగిందని.. ఇల్లు నాదే అనటంతో గొడవపడ్డట్లు మెస్సేజ్ పెట్టాడు. 

అంతే కాకుండా బాగా అప్సెట్ లో ఉన్నానని.. తన చనిపోవాలని అనుకుంటున్నట్లు మెస్సేజ్ లో పేర్కొన్నాడు. తన ప్రావిడెండ్ ఫండ్ డబ్బులు (పీఎఫ్), ఇంట్లో ఉన్న తన వస్తువులను తీసుకొమ్మని తల్లికి మెసేజ్ లో చెప్పాడు. 

పద్మావతి కుటుంబ సభ్యులు తన అల్లుడే కూతురిని చంపి తను ఉరేసుకున్నట్లు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్లు డిప్యూటీ కమిషనర్ నగేష్ తెలిపారు. అయితే పద్మావతిని భర్త చంపాడా.. ఆమె కూడా సుమంత్ లాగే సూసైడ్ చేసుకుందా.. లేదా హత్యనా అనేది నిర్ధారించాల్సి ఉందని తెలిపారు. ఆమె నేలపై చనిపోయి పడి ఉండగా.. సుమంత్ ఉరివేసుకుని వేలాడుతూ కనిపించినట్లు పోలీసులు తెలిపారు. 

సుమంత్ పెట్టిన వాయిస్ మెస్సేజ్ విన్న తర్వాత పేరెంట్స్.. ఫోన్ లో రీచ్ కావాలని.. ఓదార్చాలని ప్రయత్నం చేసినా.. అతని నుంచి రెస్పాన్స్ రాలేదని మరో పోలీస్ అధికారి తెలిపారు. 

ఇలా అయితే జెన్ జీ తరం ఉండేదా..

ఈ స్టోరీ చూస్తుంటే.. భార్య భర్తల మద్య అండస్టాండింగ్ లేకపోవడం.. ఇద్దరూ సంపాదిస్తున్న వాళ్లే కాబట్టి నువ్వెంత అంటే నువ్వెంత అని అనుకోవడంతో చినికి చినికి గాలివానలా తయారైన గొడవలా కనిపిస్తోంది. ఎందుకంటే రెంటెడ్ హౌస్ అయినప్పటికీ ఇల్లు నాది అనాల్సి వచ్చిందంటే.. ఇంట్లో ఉన్న ఫర్నీచర్ కు నేను కూడా డబ్బులు పెట్టాను.. నాదే ఇల్లు అనే ధోరణి. ఆమె అనే ముందు భర్త కూడా ఇంట్లో నుంచివెళ్లిపో.. ఇల్లు నాది అని అనుండొచ్చు.. దానికి ఆమె రిప్లైగా అలా అని ఉండొచ్చు.. లేదా ఆమెనే ముందుగా ఇల్లు నాదని చెప్పి వెళ్లిపపొమ్మని ఉండొచ్చు. ఇందులో ఏదైనా సాధ్యమే. ఎందుకంటే ఇద్దరూ వర్కింగ్ కపుల్స్ మధ్య ఇలాంటి గొడవలే జరుగుతున్నాయి.

పెద్దవాళ్లకు చెబితే ఇది ఒక సమస్యనా.. భార్య భర్తల్లో ఎవరు ఖర్చు పెట్టినా అది ఇద్దరికోసమే కదా.. నీది నాది అని అనుకోవడమేంటి అని కొట్టిపారేస్తారు. ఎందుకంటే వాళ్లు అలా బతికారు. ఒక్కసారి ముడి పడగానే.. భార్య భర్తకు.. భర్త భార్యకు అంకితమైపోయారు కాబట్టే నూరేళ్లు కలిసి జీవించి.. ఇప్పుడున్న తరాన్ని పెంచి పెద్ద చేశారు. ఆ అవగాహన వచ్చిననాడు ఈ జెన్ జీ తరం కూడా సెట్టవుతుంది. లేదంటే చంపుడు.. చంపుకునుడు.. ఎన్ని చూడాల్సి వస్తుందో.