ఫిక్స్‌డ్ డిపాజిట్ రూల్స్ మారాయి: అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనల అమలు!

ఫిక్స్‌డ్ డిపాజిట్ రూల్స్ మారాయి: అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనల అమలు!

ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాదారులు, ఇన్వెస్టర్లకు రిజర్వ్ బ్యాంక్ నుంచి కీలకమైన మార్పులు వచ్చాయి. అక్టోబర్ 1, 2026 నుంచి అమల్లోకి వస్తున్న రూల్స్ ప్రధానంగా భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టే బల్క్ డిపాజిట్ల కోసమే ఉద్దేశించబడ్డాయి. సాధారణ రిటైల్ ఎఫ్‌డీదారుల ప్రయోజనాలపై ఎలాంటి ఆటోమేటిక్ మార్పులు ఉండవని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

సాధారణంగా షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల్లో రూ. 3 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో చేసే సింగిల్ రూపీ టర్మ్ డిపాజిట్‌ను 'బల్క్ డిపాజిట్' అంటారు. ఈ కొత్త ఫ్రేమ్‌వర్క్ కింద, బ్యాంకులు తమ అధికారిక వెబ్‌సైట్‌లో బల్క్ డిపాజిట్ల వడ్డీ రేట్లను ప్రతి వర్కింగ్ డే ఉదయం 10 గంటల లోపు తప్పనిసరిగా ప్రచురించాలి.

ఈ నిబంధన వల్ల భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టే డిపాజిటర్లకు ముందే పూర్తి స్పష్టత లభిస్తుంది. అంతేకాకుండా ఒకే తేదీన.. ఒకే మొత్తంలో స్వీకరించే డిపాజిట్లకు బ్యాంకులు తమ అన్ని బ్రాంచుల్లోనూ సేమ్ వడ్డీ రేట్లను అందించాల్సి ఉంటుంది. కేవలం కస్టమర్ వేరే బ్రాంచ్‌ను సంప్రదించినంత మాత్రాన వేర్వేరు వడ్డీ రేట్లు కోట్ చేయడానికి వీలు లేదు ఇకపై.

అయితే కొన్ని నిర్దిష్టమైన సందర్భాలలో బ్యాంకులు డిఫరెన్షియల్ వడ్డీ రేట్లను ఆఫర్ చేసే వెసులుబాటును ఆర్‌బీఐ కల్పించింది. లిక్విడిటీ కవరేజ్ రేషియో ఫ్రేమ్‌వర్క్ పరిధిలోకి వచ్చే అంశాలు, కొన్ని నాన్-రెసిడెంట్ రూపీ డిపాజిట్ల విషయంలో వేర్వేరు రేట్లు వర్తించవచ్చు. కానీ ఈ ప్రత్యేక నిబంధనలను కూడా పారదర్శకంగా వెబ్‌సైట్‌లో కస్టమర్లకు తెలిసేలా అందుబాటులో ఉంచాలని రిజర్వు బ్యాంక్ ప్రకటించింది.

ఇక రూ.3 కోట్ల కంటే తక్కువ మొత్తంలో ఎఫ్‌డీలు కలిగి ఉన్న సాధారణ రిటైల్ ఇన్వెస్టర్లకు ఎలాంటి ఆందోళన అవసరం లేదు. ఈ కొత్త నిబంధనల వల్ల మీ ప్రస్తుత ఎఫ్‌డీల వడ్డీ రేట్లు మారవు. బల్క్ డిపాజిట్లు చేసేవారు మాత్రం నగదు డిపాజిట్ చేసే ముందే వెబ్‌సైట్‌లోని రేట్లను సరిచూసుకోవడం చాలా ముఖ్యం.