శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విమానం అత్యవసర ల్యాండింగ్.. సాంకేతిక లోపంతో వెనక్కి మళ్లిన ఫ్లైట్

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విమానం అత్యవసర ల్యాండింగ్.. సాంకేతిక లోపంతో వెనక్కి మళ్లిన ఫ్లైట్

హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలట్ వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) అధికారులకు సమాచారం అందించి, విమానాన్ని తిరిగి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు మళ్లించారు.

శంషాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరిన ఫ్లై591 ఎయిర్‌లైన్స్‌ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక సమస్యను పైలట్ గుర్తించారు. వెంటనే ATCకి సమాచారం అందించిన పైలట్.. విమానాన్ని తిరిగి శంషాబాద్ విమానాశ్రయానికి తీసుకొచ్చారు.

విమానాశ్రయ అధికారులు అప్రమత్తమై అత్యవసర ల్యాండింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు చేశారు. అనంతరం విమానం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ అయింది.విమానం ఎలాంటి ప్రమాదం లేకుండా సురక్షితంగా ల్యాండ్ కావడంతో అందులోని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. సాంకేతిక లోపానికి సంబంధించిన పూర్తి వివరాలు, విమానంలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారనే అంశంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.