సచిన్ 100 సెంచరీల రికార్డుపై కోహ్లీ నజర్: శతకాల మైలురాయిని విరాట్ చేరగలడా? లెక్కలు ఇవిగో!

సచిన్ 100 సెంచరీల రికార్డుపై కోహ్లీ నజర్: శతకాల మైలురాయిని విరాట్ చేరగలడా? లెక్కలు ఇవిగో!
వెస్టిండీస్‌పై 139 పరుగులతో చెలరేగిన విరాట్ కోహ్లీ 
ఈ ఇన్నింగ్స్‌లో 55వ వన్డే సెంచరీని నమోదు చేసుకున్న కింగ్ కోహ్లీ
ఇది విరాట్ కోహ్లీ కెరీర్‌లో 86వ అంతర్జాతీయ శతకం
సచిన్ 100 అంతర్జాతీయ సెంచరీల రికార్డును సమం చేసేందుకు కోహ్లీకి మరో 14 శతకాలు అవసరం

 

సచిన్ టెండూల్కర్ సాధించిన 100 అంతర్జాతీయ సెంచరీల రికార్డు ఎవరికీ అందుబాటులో ఉండదేమో అని భావించిన వేళ, విరాట్ కోహ్లీ తిరువనంతపురం వేదికగా మరోసారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించారు. వెస్టిండీస్‌పై కేవలం 88 బంతుల్లోనే 139 పరుగులు సాధించి, తన అంతర్జాతీయ శతకాల సంఖ్యను 86కు పెంచుకున్నారు. దీంతో సచిన్ ఆల్-టైమ్ రికార్డును చేరుకోవడానికి అతడు మరో 14 సెంచరీల దూరంలోనే ఉన్నాడు. సచిన్ రికార్డు బ్రేక్ చేయడానికి కేవలం 15 సెంచరీల దూరంలోనే ఉండిపోయాడు. 

సచిన్ రికార్డుకు చేరువలో కోహ్లీ: 

296 రన్స్ లక్ష్య ఛేదనలో, కోహ్లీతో పాటు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (101) అద్భుత సెంచరీతో రాణించడంతో భారత్ మరో 8.2 ఓవర్లు మిగిలి ఉండగానే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఇది వన్డేల్లో కోహ్లీకి 55వ సెంచరీ కాగా, అంతర్జాతీయ క్రికెట్‌లో 86వ శతకం. సచిన్ రికార్డును సమం చేయడానికి ఆయనకు ఇంకా 14 సెంచరీలు, దాన్ని అధిగమించడానికి 15 సెంచరీలు అవసరం. అసాధ్యం అనుకున్నదాన్ని సాధ్యం చేయడంలో దిట్ట అయిన కింగ్ కోహ్లీకి ఇది పెద్ద కష్టమేమీ కాదని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. 

లయం సాధించిన విరాట్: దినేష్ కార్తీక్

ఈ ఇన్నింగ్స్‌లో కేవలం శతకం సాధించడమే కాదు, అతడు ఆడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. దీనిపై భారత మాజీ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ మాట్లాడుతూ.. ఆయన జులై 19 తర్వాత మళ్లీ సెప్టెంబర్ 27న అంతర్జాతీయ క్రికెట్ ఆడారు. రెండు నెలల పాటు బ్యాట్ పట్టుకోని ఆటగాడిలా అతడు ఎక్కడా కనిపించలేదు. ప్రారంభం నుంచే ఎంతో ఆత్మవిశ్వాసంతో, ఆధిపత్యం చెలాయిస్తూ ఆడారు. 157 స్ట్రైక్ రేట్‌తో శతకం సాధించడం అసాధారణం. కోహ్లీ తన సహజమైన లయాన్ని (Rhythm) తిరిగి సాధించారు, ప్రపంచంలో ఆయన ఫామ్‌లో ఉంటే ఆపడం ఎవరి వల్లా కాదని ప్రశంసించారు.

100 సెంచరీల ఆశయం తప్పుకాదు: అజింక్య రహానే

ఒత్తిడి ఉన్నప్పుడే విరాట్ కోహ్లీ నుంచి అత్యుత్తమ ప్రదర్శన వస్తుందని అజింక్య రహానే వ్యాఖ్యానించారు. కోహ్లీ తనపై తాను ఒత్తిడి పెంచుకున్నప్పుడే అత్యుత్తమంగా రాణిస్తాడు. ప్రతి ఇన్నింగ్స్‌లో అతడు ఇలాగే ఆడతాడు. సచిన్ టెండూల్కర్‌ను తన రోల్ మోడల్‌గా భావించే కోహ్లీ, 100 సెంచరీల రికార్డు గురించి ఆలోచించడంలో ఏమాత్రం తప్పులేదని రహానే వెల్లడించాడు. 

ALSO READ : విరాట్‌ కొంచెం కూడా మారలేదు

సచిన్, ధోనీలపై గౌరవం చెక్కుచెదరదు: విరాట్ కోహ్లీ

తన రికార్డులపై విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. నా దృష్టిలో సచిన్ పాజీ ఎప్పుడూ సచిన్ పాజీయే. నా తొలి కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ స్థానం ఎప్పటికీ మారదన్నాడు. నాలోని ఈ భావాలు ఎప్పటికీ మారవు. నేను ఏదో సాధించేశానని ఎప్పుడూ అనుకోను.. సాధించాల్సింది ఇంకా ఉందనే భావిస్తాను అని పేర్కొన్నాడు. 

సచిన్ రికార్డును దాటడం సాధ్యమేనా?: 

ప్రస్తుతం కోహ్లీ పరిమిత ఓవర్ల క్రికెట్‌కే పరిమితమైనందున, మరో 15 సెంచరీలు సాధించడానికి అతడికి తగినన్ని ఇన్నింగ్స్‌లు, ఫిట్‌నెస్, కొంత అదృష్టం అవసరం.. వరల్డ్ కప్ ముగిసే వరకు తాను అందుబాటులో ఉంటానని కోహ్లీ ప్రకటించినందున, ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆయనకు తగినంత సమయం ఉందని దినేష్ కార్తీక్ అభిప్రాయపడ్డారు. తిరువనంతపురంలో అతడు చూపించిన ఫామ్, ఫిట్‌నెస్ చూస్తే ఈ రికార్డు అసాధ్యమేమీ కాదనిపిస్తోంది. అతడు 101 సెంచరీలు సాధిస్తారా లేదా అనేది పక్కనబెడితే, స్టేడియంలో ఆయన ఆటను ఆస్వాదించడమే క్రీడాభిమానులకు పెద్ద కానుక.