భారతదేశంలో ప్రసిద్ధి చెందిన వినాయక ఉత్సవాల్లో ఒకటైన బాలాపూర్ గణేష్ ఈ ఏడాది భక్తులను మరో దివ్యమైన రూపంలో కనువిందు చేయడానికి సిద్ధమవుతోంది. గతంలో అరుణాచలేశ్వర ఆలయం, విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ, యాదాద్రి స్వర్ణగిరి, అయోధ్య శ్రీరామ మందిరం వంటి అద్భుతమైన పుణ్యక్షేత్రాల థీమ్‌లతో భక్తులకు వైభవంగా దర్శనమిచ్చిన బాలాపూర్ గణేష్... ఈ ఏడాది ఒడిశాలోని పవిత్ర పుణ్యక్షేత్రం పూరీ శ్రీ జగన్నాథ స్వామి ఆలయ థీమ్‌లో దర్శనమివ్వబోతున్నారు.
ప్రతి ఏటా ఎంతో నైపుణ్యంతో ఈ దివ్య నమూనాలను తీర్చిదిద్దుతున్న సుధాకర్ రెడ్డి డెకరేటర్స్ ఆధ్వర్యంలో, ఈసారి జగన్నాథుని రథయాత్ర వైభవాన్ని, ఆలయ శిల్పకళను ప్రతిబింబించేలా ఈ అద్భుత రూపం రూపుదిద్దుకుంటోంది.
పూరీ జగన్నాథ స్వామి ఆలయ థీమ్‌లో కొలువవుతున్న ఈ బాలాపూర్ గణేష్ దర్శనం భక్తుల కళ్లకు పండుగలా, హృదయాలకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతూ... ఈ ఏడాది ఉత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
