అలా రెండు రోజుల కిందట తగ్గినట్లే తగ్గి మళ్లీ బంగారం రేట్లు యూటర్న్ తీసుకోవటం పెట్టుబడిదారులను సంతోషంలో నింపుతున్నప్పటికీ భారతీయ కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. శుభకార్యాలు మెుదలైన వేళ షాపింగ్ చేద్దాం అనుకుంటుంటే రేట్లు అందనంతగా పెరిగిపోతున్నాయని వాపోతున్నారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో రేట్లను గమనించి ముందుకెళ్లటం బెటర్.
ఆగస్టు 15న బంగారం రేట్లు పెరిగాయి. ఆగస్టు 14 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా రూ.71 పెరిగింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 513గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 220గా కొనసాగుతోంది.
శనివారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. ఆగస్టు 15, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతోంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి రూ.2లక్షల 55వేలుగా ఉంది. అంటే గ్రాము దాదాపు రూ.255 దగ్గర అమ్మకాలు జరుగుతున్నాయి.
