ఇండియా డెవలప్ చేస్తున్న ఫిఫ్త్ జెనరేషన్ స్టెల్త్ యుద్ధ విమాన ప్రాజెక్ట్ అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఏఎంసీఏ) కోసం కంబాట్ ఇంజిన్‌ను ఉమ్మడిగా అభివృద్ధి చేసేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రిటన్‌కు చెందిన ఏరో-ఇంజిన్ తయారీ సంస్థ రోల్స్ రాయిస్ చేతులు కలిపాయి. పవర్, ప్రొపల్షన్ టెక్నాలజీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా నిలిచే ప్రత్యేక కాంప్లెక్స్‌ను భారత్‌లో ఏర్పాటు చేయనున్నాయి. ఇక్కడ డిజైనింగ్, టెస్టింగ్, తయారీ నుంచి ఫైటర్ జెట్ల నిర్వహణ వరకు అన్ని రకాల సేవలను అందిస్తారు.
దక్షిణాది కోసం లేస్ కొత్త చిప్స్
పెప్సికో ఇండియా స్నాక్స్బ్రాండ్ లేస్ దక్షిణ ప్రాంత ప్రజల రుచికి తగ్గట్టుగా కొత్త చిప్స్‌ను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల వినియో గదారుల కోసం ఈ నూతన ఉత్పత్తిని మార్కెట్లోకి తీసుకువచ్చింది. పెరుగు అన్నం, రసం అన్నం రుచులతో ఈ చిప్స్ లభిస్తాయి. రూ.5, రూ.10, రూ.25 ధరల్లో అందుబాటులో ఉంటాయి.
ఏషియన్ ఎనర్జీ లాభం రూ.12 కోట్లు
ఏషియన్ ఎనర్జీ సర్వీసెస్ లాభం జూన్ క్వార్టర్లో 129 శాతం పెరిగి రూ.12.8 కోట్లకు చేరింది. ఆదాయం 135 శాతం వృద్ధితో రూ.271.2 కోట్లకు చేరుకుంది. బలమైన ప్రాజెక్టులు ఈ మెరుగైన ఫలితాలకు ప్రధాన కారణమని యాజమాన్యం వెల్లడించింది. కంపెనీ ఆర్డర్ బుక్ రూ.1,754 కోట్లకు చేరడంతో భవిష్యత్తుపై పూర్తి విశ్వాసం వ్యక్తమవుతోంది. చమురు, గ్యాస్ రంగాలతో పాటు ఖనిజ సేవల విభాగంలో దూసుకుపోతున్నామని ఏషియన్ ఎనర్జీ ప్రకటించింది.
