ఉమ్మడి వరంగల్‌‌‌‌, భద్రాద్రి జిల్లాల్లోని ఆలయాలకు శ్రావణ శోభ

ఉమ్మడి వరంగల్‌‌‌‌, భద్రాద్రి జిల్లాల్లోని ఆలయాలకు శ్రావణ శోభ

కాశీబుగ్గ/ భద్రాచలం, వెలుగు: శ్రావణ మాసం తొలి శుక్రవారం సందర్భంగా ఉమ్మడి వరంగల్‌‌‌‌, భద్రాద్రి జిల్లాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. వరంగల్‌‌‌‌ భద్రకాళి అమ్మవారి ఆలయంలో ఉదయం నుంచే భక్తులు దర్శనం కోసం బారులు తీరారు. 

భక్తిశ్రద్ధలతో ఒడిబియ్యం పోసి, అమ్మవారికి చీరలు సమర్పించారు. తెలంగాణ ట్రెజరీ అండ్‌‌‌‌ అకౌంట్స్‌‌‌‌ శాఖ అదనపు డైరెక్టర్‌‌‌‌ పద్మజ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో లక్ష్మీతాయారు అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చన నిర్వహించారు. సాయంత్రం మిథిలా ప్రాంగణంలో అమ్మవారికి కుంకుమార్చన జరిపించగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.