సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ధర్మన్ '( Dharman). ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 15, 2026 'జైలర్ 2' రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ సందడి ముగియక ముందే .. ప్రస్తుతం 'ధర్మన్ ' చిత్రం మైసూర్ లొకేషన్లలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. లేటెస్ట్ గా ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ఒక సెన్సేషనల్ అప్‌డేట్ టాలీవుడ్, కోలీవుడ్ వర్గాలను తీవ్రంగా ఆకర్షిస్తోంది. ఇప్పటివరకు కేవలం ప్రచారానికే పరిమితమైన ఒక క్రేజీ రూమర్ ఇప్పుడు నిజమని తేలిపోయింది.
ఈ 'ధర్మన్ ' సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న గ్లామర్ బ్యూటీ రాశీ ఖన్నా.. మైసూర్ షెడ్యూల్ విశేషాలు, అక్కడి దోశ రుచులు, షూటింగ్ జ్ఞాపకాలను ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది. అందులోని ఒక ఫొటోలో రజనీకాంత్, రాశీ ఖన్నాతో పాటు టాలీవుడ్ ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) ప్రత్యక్షం కావడం అభిమానులను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది.. నిజానికి ఈ పిక్ లోడింగ్ అయిన కొద్దిసేపటికే డిలీట్ అయినప్పటికీ, అంతలోనే నెటిజన్లు దాన్ని స్క్రీన్ షాట్లు తీసి వైరల్ చేసేశారు. దీంతో రజనీ-రామ్ కాంబో ప్రచారం కాస్తా అధికారికంగా ఖరారైపోయింది.
ఇందులో రజనీకాంత్ కూతురిగా రాశీ ఖన్నా కనిపించనుండగా.. ఆమె ప్రేమికుడిగా రామ్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పాత్ర కేవలం లవ్ ట్రాక్‌కే పరిమితం కాకుండా, ఒక నెగిటివ్ షేడ్స్ ఉన్న పవర్‌ఫుల్ విలనీ క్యారెక్టర్‌గా ఉండబోతోందనే వార్త ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. మాస్ రజనీకాంత్ తో రామ్ తన ఎనర్జీతో ఎలా ఢీకొడతాడనేది ఈ మూవీకి మేజర్ హైలైట్ కానుంది.
'ఓ మై కడవులే', తమిళ 'డ్రాగన్' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల దర్శకుడు అశ్వత్ మారిముత్తు తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ డ్రామాలో సీనియర్ నటి సిమ్రాన్ మరో ప్రాధాన్యత ఉన్న పాత్రలో అలరించనుంది. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండటంతో చార్ట్‌బస్టర్ సాంగ్స్ ఖాయంగా కనిపిస్తున్నాయి. సంక్రాంతి 2027 కు కానుకగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న 'ధర్మన్' మూవీ, రామ్ ఎంట్రీతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.
