మహీంద్రా తన సరికొత్త ఎస్యూవీ స్కార్పియో ఎన్ను హైదరాబాద్ కొంపల్లి షోరూమ్‌లో ల్యాండ్ మార్క్ షోరూంలో ఆవిష్కరించింది. ప్రత్యేక ప్రారంభ ఆఫర్లు, టెస్ట్ డ్రైవ్‌లు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకున్నాయని సంస్థ తెలిపింది. ఇది పెట్రోల్, డీజిల్ వెర్షన్లలో వస్తుంది. ఎక్స్-షోరూమ్ ధర రూ.13.69 లక్షల నుంచి మొ దలవుతుంది. అడాస్ లెవల్ 2 ఫీచర్లు, బ్లైండ్-వ్యూ మానిటరింగ్, 540-డిగ్రీ కెమెరా, ఎయిర్ బ్యాగుల వంటి ఆధునిక భద్రతా ఫీచర్లు స్కార్పియో ఎన్ సొంతం.
