హైదరాబాద్ IT కంపెనీ బిగ్ ప్లాన్.. యూరప్, అమెరికాలోకి బిట్రాన్స్ ఎంట్రీ

హైదరాబాద్ IT కంపెనీ బిగ్ ప్లాన్.. యూరప్, అమెరికాలోకి బిట్రాన్స్ ఎంట్రీ

హైదరాబాద్​, వెలుగు: ఈఆర్​పీ సొల్యూషన్స్​అందించే హైదరాబాద్ ఐటీ కంపెనీ బిట్రాన్జ్ విస్తరణకు రెడీ అయింది. ప్రస్తుతం సౌదీ అరేబియా, యూఏ ఈ​వంటి గల్ఫ్​దేశాల్లో సేవలు అందిస్తున్నామని, త్వరలో యూరప్, అమెరికా​ మార్కెట్లలోకి వెళ్తామని సంస్థ ఎండీ షకీర్​​ పాషా వెల్లడించారు. హైదరాబాద్​లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం తమ దగ్గర వంద మంది పనిచేస్తున్నారని, వచ్చే ఏడాదికి ఈ సంఖ్యను 200లకు పెంచుతామని తెలిపారు. 

ప్రపంచవ్యాప్తంగా తమకు వందకుపైగా క్లయింట్లు ఉన్నారని పేర్కొన్నారు. ఈఆర్​పీ సొల్యూషన్ల కోసం ఒరాకిల్​తో కలసి పనిచేస్తున్నామని అన్నారు.  క్లౌడ్, ఆటోమేషన్, ఏఐ సేవలతో పాటు ఖాతాదారుల వ్యాపార సవాళ్లను పరిష్కరించడంపై దృష్టి పెట్టామని పాషా తెలిపారు.  హైదరాబాద్​లో ఆర్​ అండ్​ సెంటర్​ కూడా ఏర్పాటు చేస్తామన్నారు.