చైనా చొరబాట్లపై మోడీ జవాబు చెప్పాలి: కాంగ్రెస్పార్టీ చీఫ్ఖర్గే డిమాండ్

చైనా చొరబాట్లపై మోడీ జవాబు చెప్పాలి: కాంగ్రెస్పార్టీ చీఫ్ఖర్గే డిమాండ్

న్యూఢిల్లీ: అరుణాచల్​ప్రదేశ్​లో చైనా దురాక్రమణలపై ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్​ షా దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని కాంగ్రెస్ జాతీయ​అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్​ చేశారు. దేశం మొత్తం మన సైనికుల వెన్నంటే ఉంటుంది, చైనా దురాక్రమణలను ఐక్యంగా ఎదుర్కొంటుందని స్పష్టం చేశారు. అయితే, చైనా దురాక్రమణకు సంబంధించిన నివేదికలపై మోదీ సర్కారు స్పందించాలని తేల్చిచెప్పారు. 

గల్వాన్​ ఘర్షణల తర్వాత చైనా ఇప్పుడు అరుణాచల్​ప్రదేశ్​లో కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని ఖర్గే సోషల్​మీడియా వేదికగా విమర్శించారు. 2020లో గల్వాన్​ లోయలో 20 మంది వీర జవాన్లు ప్రాణాలు కోల్పోతే స్వయంగా ప్రధాని మోదీనే చైనాకు క్లీన్​చిట్​ఇచ్చారని, ఆ చర్యే డ్రాగన్​దేశానికి మరింత ధైర్యం నూరిపోసిందని మండిపడ్డారు. ఇటీవల టక్సింగ్ ఏరియాలో చైనా సైన్యం కదలికలు పెరిగాయా..? షెరా-5 పెట్రోలింగ్ పాయింట్​పై మన సైన్యం పట్టుకోల్పోయిందా..? అని ఖర్గే ప్రభుత్వాన్ని నిలదీశారు.