కొడిమ్యాల, వెలుగు: కొత్త ఇల్లు కట్టుకుని కుటుంబంతో సంతోషంగా ఉండాలన్న ఆ గృహిణి కల నెరవేరలేదు. ఇంటి నిర్మాణం పూర్తిచేసి గృహప్రవేశం చేసి నెల రోజులు కూడా కాకముందే కరెంట్ షాక్‌తో మృతిచెందడంతో విషాదం నెలకొంది. కొడిమ్యాల మండలకేంద్రానికి చెందిన జనగం రూప(33) ఇద్దరు పిల్లలతో కలిసి గ్రామంలో నివసిస్తోంది. భర్త నరేశ్ జీవనోపాధి కోసం కొన్నేళ్లుగా గల్ఫ్‌లో ఉంటున్నాడు.
ఎంతో కష్టపడి కొత్త ఇంటి నిర్మాణం చేపట్టాడు. ఇటీవల గృహప్రవేశం చేసి.. పది రోజుల క్రితం తిరిగి గల్ఫ్‌కు వెళ్లాడు. ఇంటి కరెంట్ పనులు పూర్తికాలేదు. శుక్రవారం ఉదయం రూప ఇంటి వద్ద పనులు చేస్తోంది. బోరింగ్ వద్ద కరెంట్ వైర్లు బయటకు ఉండటాన్ని గమనించలేదు. ఆ వైర్లు తగలడంతో విద్యుత్ షాక్‌కు గురై స్పాట్లో మృతి చెందింది. భర్త నరేశ్ గల్ఫ్ నుంచి స్వగ్రామానికి బయలుదేరాడు.
