వ్యాన్ను ఢీకొట్టిన ట్రక్కు.. మహారాష్ట్రలో ఐదుగురు మృతి

వ్యాన్ను ఢీకొట్టిన ట్రక్కు.. మహారాష్ట్రలో ఐదుగురు మృతి

అమరావతి: మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. దుర్గాదేవి విగ్రహాన్ని తరలిస్తున్న వ్యాన్‌‌ను ట్రక్ వెనుక నుంచి ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 

షెగావ్ నుంచి వార్ధాకు దుర్గా పూజా కమిటీ సభ్యులు బొలెరో వాహనంలో దుర్గాదేవి విగ్రహాన్ని తీసుకుని వెళ్తుండగా ధమన్‌‌గావ్ సమీపంలో వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ట్రక్ వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. సమాచారం అందుకున్న ధమన్‌‌గావ్ రైల్వే పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ధమన్‌‌గావ్ గ్రామీణ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం వారిని వార్ధాలోని మెడికల్ కాలేజీకి తరలించారు.