గోల్డ్ కొనేటోళ్లకు లక్కీ ఛాన్స్.. శనివారం గ్రాము రేటు ఎంత తగ్గిందో తెలుసా?

గోల్డ్ కొనేటోళ్లకు లక్కీ ఛాన్స్.. శనివారం గ్రాము రేటు ఎంత తగ్గిందో తెలుసా?

వీకెండ్ సరదాగా షాపింగ్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్న తెలుగు ప్రజలకు బంగారం రేట్ల తగ్గుదల మంచి రిలీఫ్ అని చెప్పుకోవాలి. కొత్త నెల ప్రారంభంలోనే రేట్లు తగ్గటంతో దసరా, దీపావళి షాపింగ్ ప్లాన్ చేసుకుంటున్న వారికి ఇదొక సదవకాశం. అయితే షాపింగ్ చేసేదానికి ముందే తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లోని తాజా రేట్లను పరిశీలించటం ముఖ్యం. 

అక్టోబర్ 3న బంగారం రేట్లు తగ్గాయి. అక్టోబర్ 2  కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు దేశవ్యాప్తంగా రూ.110 తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 918గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 675గా కొనసాగుతోంది. 

ALSO READ : విజయ్ మాల్యా మాకు ఇంకా రూ.8వేల 752 కోట్లు బాకీ..

శనివారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. అక్టోబర్ 3, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కూడా స్వచ్ఛమైన వెండి కేజీ రూ.2లక్షల 45వేలుగా కొనసాగుతోంది. అంటే గ్రాము దాదాపు రూ.245 దగ్గర ఉంది.