Pranavi Urs: జపాన్‌లోని ఐచి-నగోయా వేదికగా జరుగుతున్న 2026 ఏషియన్ గేమ్స్‌లో భారత గోల్ఫ్ క్రీడాకారిణి ప్రణవి ఉర్స్ (Pranavi Urs) అద్భుతమైన ప్రదర్శనతో సంచలనం సృష్టించింది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య కొనసాగిన మహిళల వ్యక్తిగత స్ట్రోక్ ప్లే విభాగంలో ప్రణవి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుని సరికొత్త రికార్డు సృష్టించారు.
18వ హోల్‌లో అద్భుతమైన సంయమనం:
చివరి క్షణం వరకు అత్యంత ఉత్కంఠభరితంగా కొనసాగిన ఈ పోరులో ప్రణవి ఉర్స్ ఎంతో ఒత్తిడిని తట్టుకుని విజయం సాధించింది. 18వ హోల్‌లో ఆమె అత్యంత కీలకమైన పార్ పుట్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. దీనిద్వారా సింగపూర్‌కు చెందిన షాన్నన్ జువాన్ యిన్ టాన్, చైనాకు చెందిన రుయోనింగ్ యిన్‌లకంటే ఒక్క స్ట్రోక్ ఆధిక్యంతో అగ్రస్థానంలో నిలిచి గోల్డ్ మెడల్‌ను ముద్దాడుకున్నారు.
ఏషియన్ గేమ్స్ గోల్ఫ్‌లో తొలి భారతీయ మహిళా స్వర్ణం:
23 ఏళ్ల ప్రణవి ఉర్స్ సాధించిన ఈ విజయం భారత క్రీడా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనుంది. ఏషియన్ గేమ్స్ చరిత్రలో గోల్ఫ్ విభాగంలో వ్యక్తిగత స్వర్తం సాధించిన మొట్టమొదటి భారతీయ మహిళా గోల్ఫర్‌గా ఆమె రికార్డు సృష్టించారు. అంతేకాకుండా, 2002లో శివ్ కపూర్ స్వర్త పతకం సాధించిన తర్వాత.. మళ్లీ 24 ఏళ్ల తర్వాత భారత్‌కు గోల్ఫ్‌లో గోల్డ్ మెడల్ తెచ్చిపెట్టిన ఘనత ప్రణవికి దక్కింది.
టీమ్ ఈవెంట్‌లోనూ రజత పతకం:
వ్యక్తిగత విభాగంలో స్వర్ణం గెలవడమే కాకుండా, టీమ్ ఈవెంట్‌లోనూ భారత జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. ప్రణవి ఉర్శ్‌తో పాటు అనుభవజ్ఞులైన అదితీ అశోక్ (Aditi Ashok), దీక్షా దాగర్ (Diksha Dagar) లు సమిష్టిగా రాణించి రెండో స్థానంలో నిలిచారు. తద్వారా భారత్‌కు మహిళల టీమ్ ఈవెంట్‌లో రజత పతకాన్ని (Silver Medal) అందించారు. ఏషియన్ గేమ్స్ గోల్ఫ్ టీమ్ ఈవెంట్‌లో భారత్‌కు దక్కిన తొలి పతకం ఇదే కావడం విశేషం.
INDIA'S FIRST-EVER ASIAN GAMES WOMEN'S GOLF CHAMPION 🥇🇮🇳
— Olympic Khel ™ (@OlympicKhel) October 3, 2026
Pranavi Sharath Urs makes history as India’s first #AsianGames gold medallist in golf at #AichiNagoya2026. 👏 pic.twitter.com/UGZD20EkFL
