గ్రేటర్ వరంగల్, వెలుగు: వరంగల్ యువతకు స్థానికంగానే ఉద్యోగాలు వచ్చేలా ఆధునిక స్కిల్ ట్రైనింగ్ ఏర్పాటు చేస్తున్నామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం వరంగల్ సిటీలోని ములుగు రోడ్డులో ఐటీఐ కొత్త భవన నిర్మాణానికి రూ.25 కోట్లు మంజూరు చేసిన నేపథ్యంలో సీఎం ఫొటోకు క్షీరాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాబోయే 50 ఏండ్ల అవసరాలకు అనుగుణంగా ఐటీఐ అభివృద్ధి చేయడంతో పాటు స్థానిక యువతకు ఉద్యోగాలు వచ్చేలా ఆధునిక స్కిల్ ట్రైనింగ్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. తెలుగు అకాడమీ చైర్మన్ ప్రొఫెసర్ వెంకట నారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
