వరల్డ్ కప్ 2027 షెడ్యూల్ ప్రకటనకు తేదీ ఖరారు!: టైమ్, లైవ్ స్ట్రీమింగ్, టికెట్ల కోసం రిజిస్ట్రేషన్ కూడా! 

వరల్డ్ కప్ 2027 షెడ్యూల్ ప్రకటనకు తేదీ ఖరారు!: టైమ్, లైవ్ స్ట్రీమింగ్, టికెట్ల కోసం రిజిస్ట్రేషన్ కూడా! 

ODI World Cup 2027 Schedule: 2027 ఐసీసీ వన్డే ప్రపంచ కప్‌నకు (ICC ODI World Cup 2027) రంగం సిద్ధమవుతోంది. టోర్నమెంట్ ప్రారంభానికి ఇంకా దాదాపు ఏడాది సమయం ఉండగా, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC), క్రికెట్ సౌతాఫ్రికా (CSA) సంయుక్తంగా 2027 వన్డే వరల్డ్ కప్ పూర్తి షెడ్యూల్‌ను రేపు (అక్టోబర్ 1, గురువారం) కేప్‌టౌన్‌లో అధికారికంగా విడుదల చేయనున్నాయి. 2023 ఫైనల్ ఓటమి జ్ఞాపకాలను వెనక్కి నెట్టి, ఈసారైనా కప్పు సాధించాలనే కసితో ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉన్నారు. 

వరల్డ్ కప్ షెడ్యూల్: 

* షెడ్యూల్ విడుదల: అక్టోబర్ 1, గురువారం, భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6:00 గంటలకు) కేప్‌టౌన్‌లో లాంచ్ కానుంది.

* టీవీలో ప్రత్యక్ష ప్రసారం: స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ (Star Sports Network) ఛానెళ్లలో ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షించవచ్చు.

* లైవ్ స్ట్రీమింగ్: డిజిటల్ యూజర్లు జియోహాట్‌స్టార్ (JioHotstar) యాప్, వెబ్‌సైట్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్‌ను చూడవచ్చు.

* టికెట్ బ్యాలెట్: టోర్నమెంట్‌కు సంబంధించిన ఉచిత టికెట్ బ్యాలెట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అక్టోబర్ 1 నుంచి నవంబర్ 21, 2026 వరకు అందుబాటులో ఉంటుంది.

కొత్తగా మూడు దశల ఫార్మాట్: 

* 2023 టోర్నమెంట్‌లో కేవలం 10 జట్లు మాత్రమే పాల్గొనగా, 2027 ఎడిషన్‌ను ఏకంగా 14 జట్లతో అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఐసీసీ ఒక సరికొత్త ఫార్మాట్‌ను ప్రవేశపెట్టింది:

* ప్రిలిమినరీ రౌండ్: కిందిస్థాయిలో అర్హత సాధించిన మూడు జట్ల (ర్యాంకింగ్స్ 12, 13, 14) మధ్య 3 మ్యాచ్‌ల రౌండ్-రాబిన్ టోర్నమెంట్ జరుగుతుంది. ఇందులో టాప్‌లో నిలిచిన జట్టు మెయిన్ టోర్నమెంట్‌కు వెళుతుంది.

ALSO READ : IND vs SL సెమీఫైనల్‌కు వర్షం ముప్పు..

* గ్రూప్ దశ: ప్రధాన టోర్నమెంట్‌లో 12 జట్లు రెండు గ్రూపులుగా (ఆరు చొప్పున) విడిపోయి మొత్తం 30 మ్యాచ్‌లు ఆడతాయి. ప్రతి గ్రూప్ నుంచి టాప్-3 జట్లు తదుపరి దశకు అర్హత సాధిస్తాయి.

* సూపర్-7 దశ: ఈ దశలో 21 రౌండ్-రాబిన్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఇందులో టాప్-4 జట్లు సెమీఫైనల్స్‌కు ప్రవేశిస్తాయి.

* అక్టోబర్ 4 లేదా 5 తేదీల్లో ప్రారంభమయ్యే ఈ టోర్నమెంట్, నవంబర్ 21న జరిగే గ్రాండ్ ఫైనల్‌తో ముగియనుంది. ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతుండగా, దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఈ మెగా టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇస్తున్నాయి.