మిస్టరీ ఏంటీ:మిస్ ఎర్త్ ఇండోనేషియా పుత్రి మృతి.. పుట్టిన రోజు నాడే చివరి రోజు

మిస్టరీ ఏంటీ:మిస్ ఎర్త్ ఇండోనేషియా పుత్రి మృతి.. పుట్టిన రోజు నాడే చివరి రోజు

ఇండోనేషియా అందాల రాణి..మిస్ ఎర్త్ ఇండోనేషియా 2025 విజేత పుత్రి ఆండ్రియాని జుఫిచా జీవితం అర్థాంతరంగా ముగిసింది. తన 26వ పుట్టినరోజు జరుపుకోవాల్సిన రోజే పుత్రి ఆండ్రియాని జుఫిచా కన్నుమూశారు. అయితే ఇంత చిన్న వయసులో ఆమెకు ఏం జరిగింది? ఆమె మరణానికి అసలు కారణం ఏమిటి? అన్నది మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. మరణవార్తను అందాల పోటీ  ఆర్గనైజర్లు ధృవీకరించినప్పటికీ, కారణాన్ని మాత్రం వెల్లడించలేదు. కొసమెరుపేంటంటే కుటుంబ సభ్యులు కూడా ఆమె మరణానికి సంబంధించిన సమాచారాన్ని షేర్ చేయలేదు. దీంతో ఆమె అభిమానునులతోపాటు  ఈ వార్త విన్న అందరికీ ఆమె మృతిపట్ల పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

మిస్ ఎర్త్ ఇండోనేషియా 2025 పుత్రి ఆండ్రియాని జుఫిచా 25 ఏళ్ల వయసులో మరణించారు. ఆమె 26వ పుట్టినరోజు జరగాల్సిన ఆగస్టు 15న ఆమె మరణించినట్లు ప్రకటించారు. గతంలో జుఫిచా పోటీపడిన మిస్ గ్రాండ్ ఇండోనేషియా సంస్థ, తమ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఓ యాడ్ ద్వారా ఆ అందాల రాణి చనిపోయినట్లు ప్రకటించారు.  అయితే ఆమె మరణానికి గల కారణాన్ని వెంటనే వెల్లడించలేదు.

జుఫిచా 2025లో మిస్ ఎర్త్ ఇండోనేషియాను గెలుచుకుంది. అదే సంవత్సరంలో, ఆమె మిస్ గ్రాండ్ ఇండోనేషియాలో కూడా పోటీపడి రన్నరప్‌గా నిలిచింది. లా స్టూడెంట్ కూడా. తన తెలివి, కరుణ,అందం,స్పూర్తితో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. 

"మిస్ గ్రాండ్ ఇండోనేషియా 2025 రన్నరప్ అయిన పుత్రి ఆండ్రియాని జుఫిచా మరణం పట్ల మిస్ గ్రాండ్ ఇండోనేషియా ఆర్గనైజేషన్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. జుఫిచాకు నివాళులర్పించింది. “జుఫీచా కేవలం ఒక టైటిల్ హోల్డర్ మాత్రమే కాదు. మా గ్రాండ్ కుటుంబంలో ఒక భాగం. ఆమె కరుణ , బలం , స్ఫూర్తి తో  ఎన్నో హృదయాలను గెలుచుకున్న ఓ అందమైన ఆత్మ.” అంటూ  ప్రశంసించారు. 

"మాతో జుఫీచా ప్రయాణం చాలా త్వరగా ముగిసినప్పటికీ, ఆమె పంచుకున్న జ్ఞాపకాలు, ప్రేమఎప్పటికీ మా హృదయాల్లో నిలిచి ఉంటాయి," అని మరో పోస్ట్  షేర్ చేశారు. ఆమెకు దేవుని సన్నిధిలో విశ్రాంతి దొరకాలని  అందమైన ఆత్మ శాశ్వత శాంతిని పొందాలని రాశారు.  

జుఫిచా మరణంపై ఇప్పటికీ అనేక సందేహాలు.. ఆమె కుటుంబ సభ్యులు కూడా ఆమె మరణంపై  ప్రకటన చేయకపోవడం, ఆమె మరణాన్ని ప్రకటించిన అందాల పోటీ సంస్థ కూడా ఎలా చనిపోయింది అనే విషయాన్ని వెల్లడించకపోవడంతో ఇండేనేషియా అందాల రాణి.. మిస్ ఎర్త్ ఇండోనేషియా పుత్రి ఆండ్రియాని జుఫిచా మరణం ఇంకా మిస్టరీగానే ఉంది.