బంగారం ధర రూ.2వేల 600 డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. ఇప్పుడు తులం రేట్ ఎంతుందంటే...?

బంగారం ధర రూ.2వేల 600 డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. ఇప్పుడు తులం రేట్ ఎంతుందంటే...?
  • రూ.ఐదు వేలు తగ్గిన కేజీ వెండి ధర

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి, డాలర్ బలపడటం, క్రూడాయిల్ ధరలు పెరగడంతో దేశ రాజధాని ఢిల్లీలో బంగారం, వెండి ధరలు  సోమవారం తగ్గాయి.  99.9శాతం స్వచ్ఛమైన పది గ్రాముల  బంగారం ధర రూ.2,600 తగ్గి రూ.1,50,000 కు పడిపోయింది. గత సెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇది రూ.1,52,600 వద్ద ముగిసింది.  కిలో వెండి ధర ఏకంగా రూ.5 వేలు తగ్గి రూ.2.32 లక్షలకు చేరింది.   

అంతర్జాతీయ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్పాట్ గోల్డ్ ఔన్సు (దాదాపు 28 గ్రాముల) కు 128.93 డాలర్లు (3.01శాతం) పడి 4,156.44 డాలర్లకు చేరగా, వెండి 4.6శాతం తగ్గి ఔన్సుకు 61.34 డాలర్ల వద్ద ట్రేడయ్యింది.  పశ్చిమాసియా సంక్షోభం, బ్రెంట్ క్రూడ్ ధరలు పెరగడంతో గ్లోబల్‌‌‌‌గా  ద్రవ్యోల్బణం గరిష్టాలకు చేరింది. 

దీనికి తోడు  యూఎస్ డాలర్ బలపడటంతో బంగారం, వెండికి డిమాండ్ పడిపోయింది. రూపాయి విలువ క్షీణించడంతో ఇండియాలో వీటి ధరలు చుక్కలనంటుతున్నాయి.  దీంతో   జ్యువెలరీ అమ్మకాలు కూడా నెమ్మదించాయి.