హెడ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చేసింది.. నెలకు మంచి జీతం.. మహిళలు కూడా అప్లయ్ చేసుకోవచ్చు..

 హెడ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చేసింది.. నెలకు మంచి జీతం.. మహిళలు కూడా అప్లయ్ చేసుకోవచ్చు..

ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న హెడ్ కానిస్టేబుల్ (ఎడ్యుకేషన్ అండ్ స్ట్రెస్ కౌన్సెలర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు అర్హులైన భారతీయ పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. 

పోస్టు పేరు: హెడ్ కానిస్టేబుల్ (ఎడ్యుకేషన్ అండ్ స్ట్రెస్ కౌన్సెలర్). 

మొత్తం ఖాళీలు: 16 (పురుషులు 14: అన్ రిజర్వ్డ్ 3, ఎస్టీ–1, ఓబీసీ–8, ఈడబ్ల్యూఎస్–1, మహిళలు 2: అన్ రిజర్వ్డ్–1, ఓబీసీ–1).

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ కలిగి ఉండి, అందులో సైకాలజీ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. 
లేదా
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీతో పాటు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బి.ఎడ్) లేదా బ్యాచిలర్ ఆఫ్ టీచింగ్ (బీటీ) లేదా సమాన అర్హత కలిగి ఉండాలి.

వయసు: 2026, అక్టోబర్ 27 నాటికి 20 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: సెప్టెంబర్ 28.

అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్​మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు ఉండదు. ఇతరులు రూ.100 చెల్లించాలి. 

లాస్ట్ డేట్: అక్టోబర్ 27.

సెలెక్షన్ ప్రాసెస్:  శారీరక దారుఢ్య పరీక్ష, శారీరక ప్రమాణాల పరీక్ష, రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ recruitment.itbpolice.nic.inను సందర్శించండి.