అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(FBI) సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్‌కు చెందిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ సతీందర్‌జిత్ సింగ్ అలియాస్ 'గోల్డీ బ్రార్'ను టాప్ టెన్ మోస్ట్ వాంటెడ్ ఫుజిటివ్స్ లిస్టులో చేర్చింది. అతని ఆచూకీ తెలిపిన వారికి ఏకంగా 1 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.10కోట్ల భారీ రివార్డును ప్రకటించింది. ఈ నేపథ్యంలో గోల్డీ బ్రార్ ఎవరు, ఎక్కడివాడు, అమెరికా అధికారులు అతని కోసం ఎందుకు వెతుకుతున్నారు అనే ఆసక్తి అందరిలోనూ పెరిగిపోయింది.
అసలు గోల్డీ బ్రార్ ఎవరు?
సతీందర్‌జిత్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్ భారత్‌లోని పంజాబ్ రాష్ట్రంలో జన్మించాడు. పంజాబీతో పాటు ఇంగ్లీష్ మాట్లాడగలడు. ప్రస్తుతం ఈ గ్యాంగ్‌స్టర్ అమెరికాలోనే తలదాచుకున్నట్లు యూఎస్ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం అతను భారత్‌లో సంచలనం సృష్టించిన లారెన్స్ బిష్ణోయ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ గ్రూప్‌కు నార్త్ అమెరికా లీడర్‌గా వ్యవహరిస్తున్నాడు. అమెరికా, కెనడా, మెక్సికో, భారత్‌లలో గోల్డీ బ్రార్‌కు బలమైన క్రైమ్ నెట్‌వర్క్ ఉంది. కాలిఫోర్నియాలోని శాక్రామెంటో, ఫ్రెస్నో ప్రాంతాలతో పాటు కెనడాలోనూ ఇతని కార్యకలాపాలు విస్తరించాయి.
అమెరికాలో గోల్డీ బ్రార్ నేర సామ్రాజ్యం..
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో కలిసి గోల్డీ బ్రార్ ఉత్తర అమెరికాలో భారీ ఎత్తున నేరాలకు పాల్పడుతున్నట్లు ఎఫ్‌బీఐ తేల్చింది. ఖలిస్తాన్ వేర్పాటువాది హర్జిత్ సింగ్ నిజ్జర్ హత్యకు కుట్ర పన్నిన ప్రధాన నిందితుల్లో ఈ గ్యాంగ్‌స్టర్ ఒకడిగా ఉన్నాడట. అమెరికాలోని సౌత్ కాలిఫోర్నియా సహా ఇతర ప్రాంతాల్లో ఈ సిండికేట్ అనేక హింసాత్మక చర్యలకు పాల్పడినట్లు ఎఫ్‌బీఐ తన నివేదికలో వెల్లడించింది.
రాజకీయ, మతపరమైన ప్రముఖుల హత్యలు, కాల్పులు, మర్డర్లు, కిడ్నాపులు, బలవంతపు వసూళ్లు, దాడులు చేయడంతో పాటు ఆయుధాలు, డ్రగ్స్ స్మగ్లింగ్‌కు ఈ ముఠా పాల్పడుతోంది. భారత్ కేంద్రంగా సాగుతున్న ఈ ట్రాన్స్‌నేషనల్ ఆర్గనైజ్డ్ క్రైమ్ గ్రూప్స్‌పై అమెరికా చేపట్టిన 'ఆపరేషన్ హార్డ్‌బాల్' దర్యాప్తులో భాగంగా 37 మంది నిందితులను గుర్తించగా.. అందులో గోల్డీ బ్రార్ కీలక నిందితుడిగా ఉన్నాడు.
A man wanted for a variety of federal violations—including murder, extortion, and drug distribution—has been added to the FBI’s Ten Most Wanted Fugitives list. Satinderjeet Singh (also known as Goldy Brar, among other aliases) is wanted for his alleged involvement in the Lawrence Bishnoi Organized Crime Group, which is allegedly engaged in a variety of violent acts in Southern California and across the United States and Canada. These alleged acts include targeted assassinations—including of a prominent political and religious figure—shootings, murders, kidnappings, extortions, assaults, and the trafficking of narcotics and weapons. Singh is based in the U.S. and is the alleged leader of the group in North America. He was charged in federal court in Los Angeles with multiple violations to include racketeer influenced and corrupt organizations conspiracy; conspiracy to interfere and attempted interference with commerce by extortion; and conspiracy to distribute and possess with intent to distribute controlled substances. “Satinderjeep Singh, also known as Goldy Brar, is a dangerous individual, and the FBI and our partners have made it our priority to apprehend him, which is why we’re adding him to the FBI’s list of Top Ten fugitives and offering a reward of up to $1 million dollars for his capture,” said ADIC Grandy. “The amount of attention this list will bring to his face and description cannot be overstated; his photo will be found on every FBI-affiliated website and social media platform, and will be publicized on every phone around the world until he’s caught.” Singh is the 543rd addition to the Ten Most Wanted Fugitives list. Since the inception of the list in 1950, 28 defendants who committed crimes or are alleged to have committed crimes in the Los Angeles region were added to the list. Thirty-six defendants who committed crimes in other parts of the country have been arrested in Los Angeles. Singh is considered to be extremely violent, armed, and dangerous. He is known to reside in California and various parts of Canada. If anyone has information concerning Satinderjeet Singh, please contact the FBI's toll-free tip line at 1-800-CALL-FBI (1-800-225-5324). You may also contact your local FBI office, the nearest U.S. embassy or consulate, or you can submit a tip online at https://t.co/4Fu3GEX2Gz. Additional details: https://t.co/zl5fyUdDnv.
— FBI Los Angeles (@FBILosAngeles) September 28, 2026
ఎఫ్‌బీఐ కేసులు..
గోల్డీ బ్రార్‌పై అమెరికా న్యాయస్థానాలు కఠినమైన అభియోగాలు మోపాయి. లాస్ ఎంజెల్స్‌లోని సెంట్రల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కాలిఫోర్నియా యునైటెడ్ స్టేట్స్ డిస్ట్రిక్ట్ కోర్ట్ జూలై 1 నాడే ఈ గ్యాంగ్‌స్టర్‌పై ఫెడరల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. రాకెటీరింగ్ ఇన్‌ఫ్లుయెన్సెడ్ అండ్ కరప్ట్ ఆర్గనైజేషన్స్ కుట్ర, ఎక్స్‌టార్షన్ ద్వారా వాణిజ్య కార్యకలాపాలకు అడ్డు తగలడం, నియంత్రిత పదార్ధాల పంపిణీకి కుట్ర పన్నిన అభియోగాలపై కేసులు నమోదయ్యాయి.
సతీందర్‌జిత్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్ అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అని.. అతను ఎప్పుడూ ఆయుధాలతో సంచరిస్తాడని ఎఫ్‌బీఐ హెచ్చరించింది. అంతేకాకుండా అతను పోలీసుల కన్నుగప్పి పారిపోయే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. అతని గురించి ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే తమకు అందించాలని, సమాచారం అందించిన వారికి 1 మిలియన్ డాలర్ల బహుమతి అందజేస్తామని అమెరికా దర్యాప్తు సంస్థ ప్రకటించింది.
