జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనసు సంతోషానికి కారకుడైన చంద్రుడు ఆగస్టు 15న మధ్యాహ్నం 3.32 గంటలకు కన్యారాశిలోకి ప్రవేశించారు. జ్యోతిష్య సిద్దాంతులు తెలిపిన వివరాల ప్రకారంగా ఆరు రాశుల వారికి (మేషం, మిథున, కర్కాటక, కన్య, ధనస్సు, కుంభం) సంపద విపరీతంగా పెరుగుతుంది. ఈ రాశులతో పాటు మిగతా రాశుల వారికి ఎలాఉందో తెలుసుకుందాం. . .
మేష రాశి: కన్యారాశిలో చంద్రుని సంచారం వలన ఈరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్థిక లాభాలు ఉంటాయి. వృత్తిలో కొన్ని ఆటంకాలు ఏర్పడినా.. కొత్త అవకాశాలు ఏర్పడతాయి. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు పొందుతారు వృత్తి, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలుంటాయి. కొద్ది మొత్తం మేరకు బ్యాంక్ బాలెన్స్ పెరిగే అవకాశం ఉంది. అన్నిరంగాల్లో పై చేయి సాధిస్తారు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఆర్థిక స్థిరత్వానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అనుకున్న పనులు చాలా త్వరగా పూర్తి చేసుకుంటారు.
వృషభరాశి: కన్యరాశిలో చంద్రుని సంచారం వలన ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. కెరీర్ విషయంలో కొన్ని ఆటంకాలు కలిగినా చివరికి అనుకూలమైన ఫలితాలు పొందుతారు. ఒడిదుడికులతో కూడిన కొత్త అవకాశాలు లభిస్తాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభించేందుకు ఈ సమయం అనుకూలం లేదు. వ్యాపారస్తులకు నష్టాలు లేకపోయినా.. లాభాలు రావు. కొత్తగా పెట్టుబడులుపెట్టకపోవడమే మంచిదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఉద్యోగస్తులు అనవసరంగా మాట పడాల్సి వస్తుంది. ఆరోగ్య పరంగా కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని పండితులు చెబుతున్నారు. రుద్రాభిషేకం, హనుమాన్ చాలీసా పఠనం ద్వారా ఉపశమనం కలుగుతుంది.
మిథున రాశి: చంద్రుడు.. కన్యారాశిలో సంచారం వలన ఈ రాశి వారికి ఆదృష్టం కలిసి వస్తుందని పండితులు చెబుతున్నరు. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. జీవితంలో ఆనందం, శాంతి నెలకొంటాయి. ఆస్తికి సంబంధించి ఏదైన వివాదం నడుస్తుంటే అది పరిష్కారం అవుతుంది. ఉద్యోగస్తులు తమ సీనియర్లను మెప్పిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో మెరుగైన పురోగతి ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు ఇది చాలా అనుకూలమైన సమయం. ప్రైవేట్ ఉద్యోగస్తులకు ప్రమోషన్ రావడంతో పాటు వేతనం పెరిగే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
కర్కాటక రాశి: చంద్రుడు కన్యారాశిలో సంచారం వలన ఈ రాశి వారికి ఆనందం, శ్రేయస్సు, సమృద్ధి అందిస్తుంది. ఫలితంగా కొత్త పనులు శ్రీకారం చుట్టేందుకు అనువైన కాలం. ప్రతి పనిలో విజయం సాధిస్తారు.కెరీర్ మెరుగుదల కోసం మీరు సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభిస్తే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళే అవకాశం పొందుతారు. ఉద్యోగస్తులు ఎప్పటినుంచో ఎదురుచేస్తున్న శుభవార్త వింటారు. ఆఫీసర్ల నుంచి ప్రశంశలు అందుకుంటారు. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారు శుభవార్త వింటారు.
సింహరాశి: కన్యారాశిలోకి చంద్రుడు ప్రవేశించడం వలన ఈరాశి వారికి చాలా సంతృప్తి కరంగా ఉంటుంది. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి మంచి సమయం. ఉద్యోగస్తులు సహోద్యోగుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. బదిలీ కోసం ప్రయత్నిస్తుంటే .. అనుకున్న ఫలితాన్ని పొందుతారు. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వ్యాపారస్తులు అధిక లాభాలు గడించే అవకాశం ఉంది. అయితే ఎముకలు . గ్యాస్ట్రిక్ సంబంధ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.. కాబట్టి ఆహార విషయంలో జాగ్రత్త అవసరమని పండితులు సూచిస్తున్నారు.
కన్యా రాశి: ఇదే రాశిలో చంద్రుని సంచారం వలన ఈ రాశి అనుకూలమైన ఫలితాలుంటాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చినట్టే వచ్చి చేజారుతుంది. ఆస్తి సమస్యలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన జాబ్ వస్తుంది. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంశలు వస్తాయి. ప్రమోషన్ తో పాటు వేతనం పెరిగే అవకాశం ఉంది. వీరికి కెరీర్ పరంగా అద్భుతంగా కలిసి వస్తుంది.వ్యాపారస్తులు ఎక్కువ లాభాలు అందుకుంటారు. ఆర్థిక పరమైన సమస్యల నుంచి బయటపడతారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఎక్కువ లాభాలు అందుకుంటారు. ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అన్ని విధాలుగా కలిసి వస్తుంది.
తులారాశి:కన్యారాశిలో.. చంద్రుడు సంచారం వలన ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలుంటాయి. జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారంగా ఆర్థికంగా ... కెరీర్ పరంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు.. మీరు చేయని పనికి కూడా పై అధికారులు అపార్దం చేసుకునే అవకాశాలున్నాయి. ఎవరితోనూ ఎక్కువుగా మాట్లడకండి... ఎవరికి ఎలాంటి వాగ్డానాలు ఇవ్వవద్దు. . మీరు చేపట్టే ప్రతి పనిలో ఆలస్యం .. అడ్డంకులు వస్తాయి. ఆశించిన ఫలితాన్ని పొందడానికి మీరు చాలా కష్టపడాలి. వీలైనంతవరకు ఓపికగా ప్రశాంతంగా పరీక్షలు రాయడం మంచిది.
వృశ్చిక రాశి: చంద్రుడు కన్యారాశిలో సంచరించే సమయంలో ఈ రాశి వారు అధికంగా కష్టపడాల్సి ఉంటుంది. శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. అనుకోని పరిస్థితుల వలన కొంతకాలం వేరే ప్రదేశంలో పరిచేయాల్సి రావచ్చు. కార్యాలయంలో సహోద్యోగులు, పై అధికారుల మద్దతు ఉంటుంది. అధిక పని వలన కొంత చికాకు ఏర్పడుతుంది. ఎవరితోనూ వాదన పెట్టుకోకుండా మీ పని మీరు చేయండి. ఫలితం దానికదే వస్తుంది. ఆరోగ్యంగా కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. స్థిరాస్థులు వృద్ది చెందే అవకాశం కలదు. సమస్యలు వచ్చినప్పటికీ ఉత్సాహం తగ్గకుండా పనిచేయడంతో అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారు.
ధనుస్సు రాశి : చంద్రుడు కన్యారాశిలో సంచారం వలన ఈ రాశి వారు అన్ని విధాలా ఆనందం పొందుతారు. ఉద్యోగస్తులకు ఇది గొప్ప సమయం. కెరీర్ లో మీరు విజయం సాధించేందుకు చేసే ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. కొత్త ప్రాజెక్ట్ లేదా వెంచర్ లో పని చేస్తారు. పాత బాకీలు వసూలవుతాయి. వ్యాపారస్తులకు ఎంతో కాలంగా అమ్ముడుపోని వస్తువులకు గిరాకీ పెరుగుతుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
మకర రాశి: కన్యారాశిలో చంద్రుడు సంచరించడం వలన మకర రాశి ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి అనుకూలమైన సమయం. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. అయితే మీరు చేయాలనుకునే పనిలో స్వల్ప ఆటంకాలు వస్తాయి. నిరుత్సాహ పడకుండా.. ముందుకు సాగండి. కొత్త వెంచర్లు ప్రారంభించాలకునేవారు.. ముందుగా దైవ దర్శనం చేసుకొని ఆ తరువాత ప్రారంభించండి. విద్యార్థులకు మిశ్రమ ఫలితాలుంటాయి.
కుంభ రాశి: చంద్రుడు కన్యారాశలో సంచరించే సమయంలో పూర్వీకుల ఆస్తి లభిస్తుంది. సంతోషంగా, సంతృప్తికరమైన ఆర్థిక లాభాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యుల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. పట్టుదలతో అనుకున్న పనిని పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవం, కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు వేతనం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులు ఊహించని లాభాలు అందుకుంటారు. మీ కష్టానికి మంచి ఫలితాలు వస్తాయి. మీ ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. వృత్తి, వ్యక్తిగత జీవితం బ్యాలెన్స్ చేసుకోవడంలో విజయం సాధించే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.
మీన రాశి :చంద్రుడు కన్యారాశిలో సంచారం వలన మిశ్రమ ఫలితాలుంటాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్పొందే అవకాశం ఉంటుంది. పనిభారంతోపాటు అదనపు బాధ్యతలను నిర్వహించవలసి ఉంటుంది. కష్టానికి తగిన గుర్తింపు వస్తుంది. కుటుంబ విషయాల కారణంగా అనవసరంగా డబ్బు ఖర్చయ్యే అవకాశం ఉంది. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ నెలలో సానుకూల ఫలితం ఉంటుంది. మీరు మీ స్నేహితులతో కలిసి ఆధ్యాత్మిక ప్రదేశానికి కూడా ప్రయాణం చేయవచ్చు. వ్యాపారస్తులకు పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలమైన సమయం, సంపాదనలో మెరుగైన వృద్ధిని మరియు ఊహించని డబ్బు ను పొందుతారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
