చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలోని ఫోర్ట్ సెయింట్ జార్జ్‌లో భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం హోదాలో టీవీకే చీఫ్ విజయ్ తొలిసారి మువ్వెన్నల జెండా ఆవిష్కరించారు. అయితే, ఈ జాతీయ పండుగ వేడుకలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. సీఎం విజయ్‌కు ఆయన సహ నటి త్రిష సెల్యూట్ చేశారు. విజయ్ పోలీసుల గౌరవవందనం స్వీకరిస్తోన్న క్రమంలో ఈ స్పెషల్ మూవెంట్ చోటు చేసుకుంది.
త్రిష సెల్యూట్‌తో విజయ్ చిరునవ్వు చిందించారు. కాగా, చెన్నైలోని ఫోర్ట్ సెయింట్ జార్జ్‌లో జరిగిన ఇండిపెండెన్స్ వేడుకలలో త్రిష సందడి చేశారు. సీఎం విజయ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి వేడుకలకు హాజరైన ఆమె.. విజయ్ తల్లిదండ్రులతో కలిసి ముందు వరుసలో కూర్చున్నారు.
కాగా, ఇండిపెండెన్స్ డే వేడుకల్లో సీఎం విజయ్‌కు త్రిష సెల్యూట్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇప్పటికే వీరిద్దరి అనుబంధంపై అనేక రూమర్లు వినిపిస్తోన్న తరుణంలో తాజా ఘటనతో విజయ్, త్రిష రిలేషన్ షిప్‌పై మళ్లీ చర్చ మొదలైంది.
2026, మే నెలలో జరిగిన విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కూడా ఇలాంటి ఘటనే కనిపించింది. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో త్రిష ముందు వరుసలో కూర్చున్నారు. తన సీటులో కూర్చునే ముందు ఆమె విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్‌ను ఆప్యాయంగా కౌగిలించుకుని అందరి దృష్టిని ఆకర్షించారు.
