BHOGI Teaser: ‘భోగి’ టీజర్ గూస్ బంప్స్.. శర్వానంద్ ఊచకోతకు థియేటర్లు దద్దరిల్లాల్సిందే!

BHOGI Teaser: ‘భోగి’ టీజర్ గూస్ బంప్స్.. శర్వానంద్ ఊచకోతకు థియేటర్లు దద్దరిల్లాల్సిందే!

శర్వానంద్ హీరోగా సంపత్ నంది రూపొందిస్తున్న పీరియాడికల్ చిత్రం ‘భోగి’ (BHOGI). శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కెకె రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 1960 బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో రూపొందుతున్న ఈ చిత్రంలో అనుపమ, డింపుల్ హయాతి హీరోయిన్స్‌‌‌‌గా నటిస్తున్నారు. భీమ్స్‌‌‌‌ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ మూవీ నవంబర్ 12న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ‘భోగి’ టీజర్ రిలీజ్ చేశారు. తెలంగాణ విలేజ్ బ్యాక్ డ్రాప్, శర్వానంద్ మాస్ గెటప్.. డైలాగ్స్ ఇంపాక్ట్ తీసుకొచ్చాయి.

అనగనగా ఒక ఊరు బొగ్గులగుట్ట.. అక్కడ ఒక పటేల్ రాచరికం.. అతని కిరాతకులు అనుచరులు.. ఊరుపై దండెత్తడం.. సినిమాపై సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నాయి. హీరోయిన్ అనుపమ.. ఊళ్ళో ఉండే పటేల్ కు చెబుతూ.. శర్వా పాత్రకు ఇచ్చే ఎలివేషన్.. సినిమా టోన్ ని ఎలివేట్ చేస్తుంది.. ఆ తర్వాత శర్వాలో ఉన్న రస్టిక్ రౌద్రం.. రౌడీల తలలు ఎగిరిపోవడం..‘‘ఎట్లనో నేను సూస్తా పటేలా .. నేను సేయ్యా.. సెయ్యనియ్యా.. సచ్చినా మా అమ్మయ్యలా తోడు.. ఆ తొమ్మిది మెట్లను నా కత్తితో కడిగి.. మీ నెత్తిటితో కడగకపోతే నా పేరు కుమ్మరోల్లా గంగానే కాదు’’ అని హీరో శర్వా చెప్పే ఇంటెన్స్ డైలాగ్ భోగి సినిమాపై పీక్ లెవల్లో అంచనాలు పెంచేసింది. ఇప్పటికే, ఫస్ట్ స్పార్క్ పేరుతో విడుదల చేసిన కాన్సెప్ట్ వీడియోకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. భీమ్స్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొత్తగా.. ఇంటెన్స్గా ఉంది.