ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్వర్ రాజీనామా చేయాలంటూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న క్రమంలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ( అక్టోబర్ 4 ) తమిళనాడులో పర్యటిస్తున్న ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సంఘంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సీబీఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్టుమెంట్ల లాగే... ఎన్నికల సంఘం కూడా మోడీ, బీజేపీ కనుసన్నల్లో నడుస్తోందని అన్నారు షర్మిల.
దేశంలో ప్రతి పౌరుడికి ముఖ్యంగా సమాజంలో అత్యంత పేదవారికి కూడా ఓటు హక్కు ఎంతో పవిత్రమైనదని, అది ప్రతి ఒక్కరి వ్యక్తిగత హక్కు అని అన్నారు. ఓటు హక్కు ద్వారానే భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య దేశంగా నిలిచిందని అన్నారు. ఎన్నికల సంఘం కొందరి కనుసన్నల్లోనే నడుస్తోందని అన్నారు.
►ALSO READ | మహిళా జర్నలిస్టుపై లైంగిక వేధింపులు! ..ఢిల్లీ పోలీసుల మిస్ బిహేవియర్ పై రాహుల్ ఫైర్
అందరు కమిషనర్ల ఏకాభిప్రాయం లేకుండానే 14 కీలక ఉత్తర్వులు జారీ చేయడం బీజేపీ నిరంకుశ ధోరణికి నిదర్శనమని అన్నారు షర్మిల. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నానని అన్నారు షర్మిల.
దేశంలో రాజ్యాంగ విలువలను, ప్రజాస్వామ్య హక్కులను కాపాడుకునేందుకు పౌరులందరూ ఏకం కావాలని.. రాహుల్ గాంధీ అడుగుజాడల్లో దేశ ప్రజల కోసం కాంగ్రెస్ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని అన్నారు షర్మిల.
