తిరుపతి: తిరుమలలో టీటీడీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మన్యం జిల్లా పార్వతీపురం నుంచి తిరుమల గోడౌన్‌కు చేరుకున్న జీడిపప్పు స్టాక్‌ను అధికారులు వెనక్కి పంపించేశారు.
12 టన్నుల జీడిపప్పును క్వాలిటీ టెస్ట్లో ఫెయిల్ కావడంతో టీటీడీ ఆ జీడిపప్పును తీసుకోలేదు. టీటీడీ ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్ పరీక్షల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని నిర్ధారణ కావడమే ఇందుకు కారణం.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం తయారీలో వాడే ముడి సరుకుల నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీపడకూడదని టీటీడీ నిర్ణయించింది. తిరుమల లడ్డూ చుట్టూ ఇప్పటికే అనేక వివాదాలు నెలకొన్న క్రమంలో.. తిరుమలలో ప్రసాదాల తయారీపై టీటీడీ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది.
తిరుమలలో ప్రసాదంగా లడ్డూను ఇవ్వడం 1715 ఆగస్టు 2 వ తేదీన మొదలైందని చెబుతుంటారు. ప్రతి నిత్యం దాదాపు మూడు లక్షలకు పైగానే లడ్డూలను టీటీడీ తయారు చేస్తోంది. 15వ శతాబ్దంలో భక్తులకి వడ ప్రసాదం మాత్రమే అందించేవారు. ఆ తర్వాత17 వ శతాబ్దం నుంచి బూందీ లడ్డూను అందించారు. ఆ తరువాత హథీరాంజీ మఠం నిర్వాహకులు లడ్డూలు తయారు చేసేవారు.
