హిట్‌మ్యాన్‌తో ఫొటోలు దిగేందుకు ఫ్యాన్స్ పోటీ.. ఇంతలోనే జారిపడిన రోహిత్ ఫోన్‌.. వీడియో వైరల్!

హిట్‌మ్యాన్‌తో ఫొటోలు దిగేందుకు ఫ్యాన్స్ పోటీ.. ఇంతలోనే జారిపడిన రోహిత్ ఫోన్‌.. వీడియో వైరల్!

Rohit Sharma: వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను ముగించుకుని ముంబైకి తిరిగి చేరుకున్న భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మకు ఎయిర్‌పోర్ట్‌లో ఊహించని అనుభవం ఎదురైంది. అభిమానులతో ఉత్సాహంగా ఇంటరాక్ట్ అవుతున్న సమయంలో ఆయన చేతిలో నుంచి మొబైల్ ఫోన్ అనుకోకుండా కిందపడిపోయింది. ప్రస్తుతం ఈ చిన్న ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అభిమానుల తాకిడి.. జారిపడిన మొబైల్: 

వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డే ముగిసిన తర్వాత ముంబై ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న రోహిత్ శర్మను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. మాజీ కెప్టెన్‌ను ఒక్కసారి చూసేందుకు, ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఎయిర్‌పోర్ట్ టెర్మినల్‌లో అభిమానులు ఎగబడ్డారు. ఈ క్రమంలో అభిమానులతో మాట్లాడుతూ ముందుకు సాగుతున్న రోహిత్ చేతిలో నుంచి మొబైల్ ఫోన్ జారి కిందపడింది.

►ALSO READ | భారత్ vs పాక్ మ్యాచుకు రికార్డ్ వ్యూస్.. ఆసియా క్రీడలకు కాసుల వర్షం!

అక్కడున్న వారిని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసిన ఈ చిన్న పొరపాటును రోహిత్ ఎంతో ప్రశాంతంగా తీసుకున్నారు. కిందపడిన ఫోన్‌ను తనే స్వయంగా తీసుకుని, ఎలాంటి అసహనం ప్రదర్శించకుండా చిరునవ్వుతో ఫ్యాన్స్ ను పలకరిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. రోహిత్ చూపిన ఈ సంయమనం, డౌన్- టు -ఎర్త్ స్వభావం మరోసారి అభిమానులను ఆకట్టుకుంది.